నేటి రోజుల్లో అయితే ప్రతి ఒక్కరికి టెక్నాలజీతో కూడిన అలారం అందుబాటులోకి వచ్చింది. ఇక పొద్దున లేవాలి అంటే ఆ అలారం సౌండ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి మెలుకువ వస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఒకప్పుడు మాత్రం ఇలాంటి అలారం ఎవరికీ అందుబాటులో ఉండేది కాదు అనే చెప్పాలి. కేవలం కోడికూతనే అలారం గా భావించే వారు. ఎప్పుడు కోడి కూస్తే  అప్పుడు తెల్లారింది అని  నిద్రలేచేవారు అనే చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కోడికూత ఎక్కడైనా వినిపించింది అంటే చాలా చిరాకు పడటం మొదలు పెడుతున్నారు అందరు.


 పక్కింట్లోనో ఎదురింట్లోనో కోడి ని పెంచుకోవడం లాంటివి చేస్తే అది ఎప్పుడైనా కూత పెట్టింది  అంటే ఇంకేముంది దీని గురించి గొడవకు దిగడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకంగా వృద్ధ దంపతులు కోడి కూత కారణంగా తమకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెబుతూ చివరికి కోర్టుకెక్కారు. కోడి పుంజు పై కేసు పెట్టారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన జర్మనీలో వెలుగులోకి వచ్చింది. వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, ఝాట జంట కోడిపుంజు తెగ ఇబ్బంది పెడుతుందని.. దాని బారి నుంచి తమకు ఉపశమనం కల్పించాలి అంటూ ఏకంగా కేసు పెట్టడం గమనార్హం.. అయితే ఇక్కడ కోడి కూస్తుంది 10, 20 సార్లు కాదు ఏకంగా రోజుకు రెండు వందల సార్లు కూస్తూనే ఉందట. అది కూడా 80 డెసిబుల్స్ రేంజ్ కూస్తూ ఉందని  వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.


 అంటే రద్దీగా ఉన్న వీధి లో వచ్చే శబ్దం అంత గట్టిగా కోడి కూస్తూ ఉందట. ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఇతరుల కోళ్లతో పాటు గూట్లోకి చేరేంతవరకు కూడా ఇలా కోడికూస్తూనే ఉందట. కొన్నాళ్లపాటు ఈ గోల అనుభవించిన ఈ వృద్ధ దంపతులు ఇక మా వల్ల కాదు అని కోడి పై కేసు పెట్టడం గమనార్హం. తమ పక్కింటి వాళ్ళు కోడిని వదులుకోలేరు. అది ఉంటే మేము ప్రశాంతంగా నిద్రపోలేము. తలుపులు కిటికీలు తీస్తే నాన్స్టాప్గా చప్పుడు వస్తూనే ఉంది.  ఆ సౌండ్ కారణంగా గార్డెన్ కూడా వెళ్లలేక పోతున్నాము అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీనిపై త్వరలో విచారణ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri