ఇటీవల కాలంలో విద్యుత్ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం ఏకంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సాధారణంగా ఒక నెల మొత్తం కరెంటు వాడితే ₹1000 బిల్లు వస్తుంది. మరీ కాస్త ఎక్కువ వాడితే 1500 లేకపోతే ₹2,000 బిల్లు వస్తుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం విద్యుత్ అధికారులు ఒక సామాన్య కుటుంబానికి కూడా ఏకంగా లక్షల రూపాయల బిల్లు వచ్చినట్లు రసీదులు అందిస్తూ ఉండడం చూసి సామాన్య ప్రజలందరూ ఒక్కసారిగా అవ్వక్కవుతున్న  పరిస్థితి కనిపిస్తుంది.


 ఇక ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు నెలరోజులపాటు కరెంట్ వినియోగించినందుకు గాను లక్షల రూపాయల బిల్లు వేయడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం కేవలం 24 గంటల పాటు కరెంటు వినియోగించినందుకు గాను ఏకంగా 37 లక్షల రూపాయలు ఛార్జ్ చేశారు అధికారులు. దీంతో ఇక ఈ భారీ మొత్తంలో బిల్లు చూసి సదరు మహిళ ఒక్కసారిగా అవాక్కయింది అని చెప్పాలి. స్మార్ట్ మీటర్ల ద్వారా ఇంత భారీ బిల్లు రావడం ఏంటి అని ముక్కున వేలేసుకుంది.


 ఇంతకీ ఏం జరిగిందంటే. చోలే మైల్స్ ప్రియర్ అనే 25 ఏళ్ళ యువతి యూకే నివాసి. కుమార్తెతో కలిసి ఇంట్లో ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇంటి ఎలక్ట్రికల్ స్మార్ట్ మీటర్కు ఒక రీడింగ్ వచ్చింది. ఏకంగా 37 లక్షల రూపాయలు బిల్లు అయింది అని చూపించింది. ఈ విషయంపై విద్యుత్ సంస్థ క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి   అయితే కరెంట్ బిల్లు పరిమితంగా వచ్చేలా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని ఫలితంగా వారి ఇంటికి సాధారణంగా బిల్లు కేవలం 160 రూపాయలు మాత్రమే వస్తుంటుంది. కానీ ఇప్పుడు 37 లక్షలు రావడం జరిగిందంటే ఎక్కడో పొరపాటు జరిగిందని.. ఇక తమ పొరపాటును సరిదిద్దుకుంటాము అంటూ విద్యుత్ సంస్థ అంగీకరించింది అని చెప్పాలి.. అయితే 37 లక్షల బిల్లు చూడగానే గుండెపోటు వచ్చినంత పని అయింది అంటూ సదరు బాధితురాలు చెబుతూ ఉండడం గమనార్హం  .

మరింత సమాచారం తెలుసుకోండి: