ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు ఇంత గొప్ప అదృష్టం మనకెందుకు రావడం లేదబ్బా అని నెటిజెన్లు అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే అదృష్టం మన వెంటే ఉంటే ఎలాంటి సిచువేషన్ లో అయినా సరే అనుకూల వాతావరణం ఉంటుంది అన్నదానికి నిదర్శనం గా ఇక్కడ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఎంతోమంది ఇటీవల కాలంలో లాటరీ టికెట్ కొనుగోలు చేసి చివరికి డబ్బులు గెలుచుకోలేక నిరాశ పడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మహిళకు డస్ట్ బిన్ లో దొరికిన కాగితమే కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది.
అమెరికాకు చెందిన 60 ఏళ్ల జాక్వలిస్ లేహ్ అనే మహిళకు ఒక లాటరీ టికెట్ రూపంలో జాక్పాట్ తగిలింది. ఆమె ఒక స్టోర్ నుంచి నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. దీనికోసం ఐదు డాలర్లు వెచ్చించింది. అయితే ప్రతి టికెట్కు అదృష్టం వరించదు కదా అని భావించి లాటరీ టికెట్ చెత్తబుట్టలో పడేసింది. కానీ ఎందుకు అదృష్టాన్ని చేజేతులార పోగొట్టుకోవడం అని భావించి మళ్లీ చెత్త బుట్టలో నుంచి లాటరీ టికెట్ తీసి భద్రపరిచింది. చివరికి ఆమెవద్దు అనుకొని చెత్త బుట్టలో పడేసిన ఆ కాగితమే రెండు లక్షల డాలర్లు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఆమె స్పందిస్తూ పారేద్దాం అనుకున్న లాటరీ టికెట్ వల్ల అదృష్టం వరించిందని ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటూ సంతోషం వ్యక్తం చేసింది.