సాధారణంగా జాలర్లు ఎప్పుడు సముద్రంలో వేటకు వెళుతూ ఉంటారు. ఇక సముద్రం వేటకు వెళ్ళిన సమయంలో పట్టిన చేపలను అమ్ముతూ జీవనోపాధి పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు సాధారణ చేపలు ఎప్పుడూ వాళ్లకు చిక్కుతూనే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అరుదైన చేపలు వలకు చిక్కుతూ ఇక జాలరుల కు అదృష్టం వరిస్తూ ఉంటుంది అని చెప్పాలి.  ఇలా వలకు చిక్కిన అరుదైన చేపలు లక్షల రూపాయల పలకడం లాంటివి జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మరికొన్నిసార్లు వింతైన వస్తువులు జాలర్ల వలకు చిక్కి షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇస్కాన్సిస్ రాష్ట్రం ఎల్క్ హార్న్ ప్రాంతానికి చెందిన ఆంటీ మూర్ అనే వ్యక్తి తరచూ ఫిషింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు. అయితే ఇటీవల మిస్సోరి నదిలో జరిగిన ఫిషింగ్ పోటీలలో పాల్గొన్నాడు సదరు వ్యక్తి.  ఎంత ప్రయత్నించినా కూడా అతని గాలానికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఇలాంటి సమయంలోనే అతని గాలం  బరువుగా మారిపోయింది. ఏదో చిక్కింది అని అతనికి అర్థమైంది. ఇక బరువు ఎక్కువగా ఉండటంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పెద్ద చాప చిక్కి ఉంటుందని ఎంతో ఆనందంగా గాలాన్ని బయటకు తీసి చూసాడు.



 కానీ గాలానికి చిక్కిన వస్తువును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏదో చేప ఆస్తిపంజరం కనిపించింది. వింతగా కనిపించిన ఆ ఎముకల గూడును చూసి మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని మరిచిపోయాడు. ఎందుకైనా మంచిది అని ఇక ఆ ఎముకల గూడుతో ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఇక తర్వాత ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయగా కొందరు దీన్ని అరుదైన చేప అని గుర్తించి అతనికి చెప్పారు. అయితే వెంటనే ఈ విషయాన్ని శాస్త్రవేత్తలకు సమాచారం అందించాడు. శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి పరీక్షించి మరింత షాక్ అయ్యారు.  ఎందుకంటే అది తొమ్మిది కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన బుల్ డాగ్ చేపకు చెందిన అస్తిపంజరం అన్న విషయాన్ని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: