ఈ క్రమంలోనే కొంతమంది దుస్తుల విషయంలో చేసే ఖర్చులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇలా భారీగా ఖర్చు చేసి సరికొత్త డిజైన్లను కొనుగోలు చేయడం లేదంటే తమకు నచ్చిన విధంగా ప్రత్యేకమైన దుస్తులను తయారు చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా కొత్త దుస్తులు కొనడానికి భారీగా ఖర్చుపెట్టిన వారిని ఇప్పటి వరకు చూసే ఉంటాం. కానీ పాత జీన్స్ ప్యాంట్లను కొనుగోలు చేయడానికి లక్షలు ధారపోయడాన్ని ఎవరైనా చూశారా.. పాత జీన్స్ ప్యాంట్ల కోసం లక్షలు ధారపోయడమేంటి అని అనుకుంటున్నారు కదా..
ఇది కేవలం జోక్ మాత్రమే అనుకుంటే మాత్రం పప్పులు కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ నిజంగానే ఇది జరిగింది. మెక్సికోలో జరిగిన ఒక వేలం పాటలో రెండు పాత జీన్స్ ప్యాంట్లు ఏకంగా 76,000 డాలర్లు అంటే మన కరెన్సీలో 60 లక్షల రూపాయలకు పైగానే. ఇంతకీ ఈ పాత జీన్స్ ప్యాంట్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా ఈ రెండు జీన్స్ ప్యాంట్లు కూడా 1880 కాలం నాటి లెవీ జీన్స్ కావడం గమనర్హం. అందుకే ఈ ప్యాంట్స్ కు అంత ధర పరికింది. శాండీయాగోకు చెందిన కైల్ హౌపర్ట్ అనే 23 ఏళ్ల దుస్తుల వ్యాపారి రెండు ప్యాంట్లను కొనుగోలు చేశాడు. ఇక పాత ప్యాంట్స్ కోసం ఇంత ధర పెట్టారా అని ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.