ఈ క్రమంలోనే రష్యా సేనలకు ఎక్కడికక్కడ ప్రతి ఘటనలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా అటు రష్యా ప్రభుత్వ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎన్ని దేశాలు హెచ్చరించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరు మార్చుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఎడతెరిపి లేకుండా మిస్సైల్ దాడులు చేయడమే కాదు ఇక ఉక్రెయిన్ లో మారణ హోమాలను సృష్టిస్తుంది రష్యా సైన్యం. అంతేకాకుండా ఎన్నో అరాచకాలకు పాల్పడుతుంది అని చెప్పాలి. సాధారణంగా సైన్యం శత్రు దేశాలతో పోరాడటం మాత్రమే ఇప్పటివరకు తెలుసు. కానీ రష్యా సైనికులు అటు ఉక్రెయిన్ లో దాష్టికానికి పాల్పడుతున్నారు.
ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులు చేసేందుకుగాను రష్యా ప్రభుత్వం ఏకంగా తమ సైనికులకు వయాగ్రా ఇస్తుందని ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ప్రమీల పాటన్ ఆరోపించారు. ఇక ఆమె చేసిన ఆరోపణలు కాస్త సంచలనగా మారిపోయాయి. ఇలా ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల లైంగిక దాడులు ఆ దేశ సైనిక వ్యూహంలో ఒక భాగమే అంటూ ఆరోపించారు ఆమె. రష్యా సైనికుల వద్ద వయాగ్రా టాబ్లెట్లు ఉన్నట్లు గుర్తించామని బాధిత ఉక్రెయిన్ మహిళలు చెప్పినట్లు ఆమె తెలిపారు.