అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధులు వైరస్లు అన్నీ కూడా చైనాలోనే పుట్టుకు వస్తాయని ఎంతోమంది నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఎలాంటి జీవిని ఆహారంగా తిన్నప్పటికీ వాటిని తగిన ఉష్ణోగ్రతలో వండుకున్న తర్వాతనే ఆహారంగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే చిత్ర విచిత్రమైన జీవులను తిన్న చైనీయులకు అంత తొందరగా వ్యాధులు రావు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా పీత మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.
ఏది పడితే అది.. ఎలా పడితే అలా తింటే ప్రాణాల మీదికి వస్తుంది అన్నదానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనం అని చెప్పాలి. సజీవంగా పీతను తిన్న వ్యక్తి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సదరు వ్యక్తి కూతురిని పీతా కరిచింది. దీంతో అతను కోపంతో ఊగిపోయాడు. ఎలాగైనా పీతపై రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే సజీవంగా ఉన్న పీతను లటుక్కున నోట్లో వేసుకొని ఆహారంగా మార్చుకున్నాడు. కానీ ఆ తర్వాతే అతనికి అసలు కష్టాలు మొదలయ్యాయి. పీతను సజీవంగా తినడం వల్ల 'లు' అనే వ్యక్తి శరీరంలో పారాసైట్లు చేరి లివర్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీసాయ్ దీంతో ఆసుపత్రిలో మంచానికి పరిమితమయ్యాడు.