అయితే ఇప్పటివరకు ఎంతోమంది ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని నిరూపించి.. తమ కంటే పెద్దవారిని పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి క్రీడాకారులు వరకు ఇప్పటివరకు ఎంతోమంది ఇలా తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకొని ఎంతమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఇలా తమకంటే రెండు మూడేళ్లు మహా అయితే ఒక 10 ఏళ్లు పెద్ద వారిని పెళ్లి చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ మాత్రం 28 ఏళ్ల యువకుడు 83 ఏళ్ల బామ్మను ప్రేమించాడు. అంతటితో ఆగకుండా వివాహం కూడా చేసుకున్నాడు. ప్రేమ గుడ్డిది అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు.
ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. పోలాండ్ కు చెందిన 83 ఏళ్ల వృద్ధురాలికి పాకిస్తాన్ కు చెందిన 28 ఏళ్ల హఫీజ్ నాదీమ్ అనే యువకుడికి ఫేస్బుక్ వేదికగా పరిచయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇక 83 ఏళ్ల వయసులో ఆ బామ్మ ఎంతో రిస్కు చేసింది.. ప్రియుడుతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుని భావించి పోలాండ్ నుంచి పాకిస్తాన్ కు వచ్చేసింది. చివరికి పెద్దలను ఒప్పించి ఇక ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ప్రస్తుతం సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు.