గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ఎంతగానో ఆశ పడుతూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అయితే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం అనేది అంత ఆశమాశి విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరిలో కెల్లా మనలో ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉన్నప్పుడు మాత్రమే ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన పేరుని లికించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇలా ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేందుకు ఎంతో మంది ఒకే విషయంపై ఏళ్ల తరబడి కఠిన సాధన చేసి చివరికి ఎవరికి సాధ్యం కాని రీతిలో తమ ప్రతిభను నిరూపించుకొని గిన్నిస్ బుక్ రికార్డును కొడుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఇటీవల కాలంలో ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం కోసం ఎంతోమంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం  కూడా ఎంతో మందిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఏకంగా కొంతమంది అయితే ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుని మరి వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా బాడీలో ఉన్న అవయవాల కారణంగా కూడా వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఒక మహిళ ఏకంగా తన కాళ్ల కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది అని చెప్పాలి. అదేంటి అందరికీ కాళ్లు ఉంటాయి. ఆమెకి కూడా కాళ్లు ఉన్నాయి. గిన్నిస్ బుక్ రావడానికి ఇక ఆమె కాళ్లల్లో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారు కదా.


 అందరి కాళ్ళతో పోల్చి చూస్తే ఆమె కాళ్ళు ప్రపంచంలోనే చాలా పెద్దవి. అందుకే గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది సదరు మహిళ. అమెరికాకు చెందిన హెర్బర్ట్ అనే మహిళకు కుడి పాదం 33.1 సెంటీమీటర్లు అంటే 13.03 అంగుళాలు ఉండగా.. ఎడమ పాదం 32.5 సెంటీమీటర్లు అంటే 12.79 అంగుళాలు ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద పాదాలు కలిగిన మహిళగా సదరు మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఈ విషయాన్ని సదరు మహిళ ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: