ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథంలో ప్రపంచ నలమూలల్లో ఎక్కడ ఏ ఘటన జరిగిన కూడా కేవలం నిమిషాల వ్యవధిలోని అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనలు ప్రతి ఒక్కరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇలాంటివి కూడా నిజంగా జరుగుతాయా అని నమ్మశక్యం కాని ఘటనలు కూడా అప్పుడప్పుడు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.


 సాదరణంగా మనిషి అన్నాక ఏదో ఒక సందర్భంలో దగ్గు తుమ్ము లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కరోనా వైరస్ సమయంలో అయితే దగ్గు తుమ్ము వస్తే మాత్రం పక్కనున్నవారు కాస్త భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఎక్కువగా అయితే జలుబు చేసినప్పుడు లేదా ఏదైనా దుమ్ము దులి ముక్కులోకి గొంతులోకి చేరినప్పుడు దగ్గు తుమ్ము లాంటివి  రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా దగ్గు వచ్చినప్పుడు వాటర్ తాగి సైలెంట్ గా ఉండిపోతారు అందరు. కానీ కేవలం దగ్గడం కారణంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందా అంటే అలా ఎందుకు జరుగుతుంది అని అందరూ చెబుతారు.


 ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి  ఏకంగా దగ్గడం కారణంగా ఒక యువతి పక్కటెముకలు విరిగిపోయాయి. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. చైనాలో ఉండే హువాంగ్ అనే యువతి స్పైసీ ఫుడ్ తింటూ దగ్గు రావడంతో గట్టిగా దగ్గింది. కొంత సమయం తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో హాస్పిటల్కి వెళ్ళగా ఇక వైద్యులు పరీక్షలు చేసి చూడడంతో నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు. తక్కువ బరువు ఉండటం వల్లే ఇలా జరిగిందని.. ఎముకలకు మజిల్ సపోర్ట్ లేకపోతే ఇలాగే జరుగుతుందని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri