ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ నలుమూలల్లో జరిగిన ఆసక్తికర ఘటనలు అన్నీ కూడా అటు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు ఎంతో మందిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి అందరిని నోరేళ్లపెట్టేలా చేసింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి తెలిసిన తర్వాత షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇంతకీ అంతలా అందరిని ఆశ్చర్య పరుస్తున్న వార్త ఏమిటో తెలుసా ఒక మహిళ పెళ్లి చేసుకోవడమే.


 అదేంటి ఎవరైనా పెళ్లి చేసుకుంటే మంచి పని చేసింది అని మెచ్చుకుంటారు. కానీ ఆ మహిళ పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అనుకుంటున్నారు కదా.. ఎందుకంటే సదరు మహిళ అంత వింతైన పెళ్లి చేసుకుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది యువతులు అబ్బాయిలపై విరక్తితో తమను తామే పెళ్లి చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే బంధుమిత్రులందరిని పిలిచి ఇక అందరి సమక్షంలో తమను తామే పెళ్లి చేసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇక కొంతమంది పెంపుడు జంతువులను కూడా పెళ్లి చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ జరిగిన పెళ్లి మాత్రం మరింత విచిత్రమైనది అని చెప్పాలి. ఏకంగా ఒక యువతి దుప్పటిని పెళ్లి చేసుకుంది. ఇంగ్లాండుకు చెందిన పాస్కేల్ సెల్లిక్ అనే యువతి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మెత్తటి దుప్పటిని పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన పెళ్లికి దాదాపు 150 మందిని ఆహ్వానించి తన ప్రియుడి అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకుంది యువతి. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగచక్కర్ల కొడుతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: