ఇలా ఇటీవల కాలంలో తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎక్కువ మంది ప్లాస్టిక్ సర్జరీల పైనే ఆధారపడుతున్నారు కొంతమంది. కేవలం ముఖానికి మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని శరీరాకృతిని మొత్తం మార్చేసుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు బెడిసి కొట్టి ఉన్న అందం కూడా పోయి అందవిహీనంగా మారుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక మరి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాగే ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలని ఆశపడిన యువతీ చివరికి ప్రాణాలు కోల్పోయింది.
అమెరికాలోని షాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 21 జూలియబ్ కార్డేనాస్ అనే అమ్మాయి అందంగా కనిపించేందుకు ఇటీవలే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యువతీ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అప్రమత్తమైన పేరెంట్స్ ఇక ఆసుపత్రికి తరలించగా ఆమె ఊపిరితిత్తులు మొత్తం రక్తముతో నిండిపోయినట్లు వైద్యులకు గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు యువతి ఆరుసార్లు కార్డియాక్ రెస్పిరేటరీ అరెస్టుకు గురై మృతి చెందింది అని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.