గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అయితే ఇలా వరల్డ్ రికార్డు సాధించడం మాత్రం ఆశపడినంత సులభం కాదు అని చెప్పాలి.. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేందుకు అవకాశం ఉంటుంది.  ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో రీతిలో టాలెంట్ ను నిరూపించుకుని గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ఒకే విషయంపై శ్రమించి ఇక అందరికంటే ప్రత్యేకంగా ఆ పనిని చేయడం నేర్చుకొని చివరికి గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించిన వారు చాలామంది ఉన్నారు.


 అయితే ఇలా ఇటీవలే కాలంలో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటున్న వారిలో కొంతమంది రోజూ చేసే పనులనే కాస్త విచిత్రంగా చేసి వరల్డ్ రికార్డు సాధిస్తూ ఉంటే.. మరి కొంత మంది మాత్రం ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ఇక రికార్డులు కొడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఒక స్విమ్మర్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఏకంగా 6 గంటల్లో 11.649 కిలోమీటర్లు ఈత కొట్టి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు. అలా ఈత కొట్టడం ఎవరైనా చేస్తారు అంతమాత్రానికే గిన్నిస్ బుక్ రికార్డు ఇస్తారా అని అంటారా..



 అయితే అతను ఎలా ఈత కొట్టాడో తెలిస్తే మాత్రం ప్రతి ఒకరు షాక్ అవుతారు. ఏకంగా చేతులకు బేడీలు వేసుకుని ఆరు గంటల్లో ఇక 11.649 కిలోమీటర్ల వరకు ఈత కొట్టాడు సదురు వ్యక్తి. షహబ్ అల్లం అనే స్విమర్ అరేబియా గల్ఫ్ లో ఇలా చేతికి సంకెళ్లు వేసుకుని ఈత కొట్టి గిన్నిస్ రికార్డు సాధించాడు. కాగా 2021 లో బెంజమిన్ కార్జు మాన్ ఇలా చేతికి సంకెళ్లు వేసుకుని 5.35మైళ్లు ఈత కొట్టి ఇక గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించగా... ఇక ఇప్పుడు ఈ రికార్డును షహబ్ అల్లం బ్రేక్ చేశాడు అని చెప్పాలి. అయితే ఇలా చేతికి సంకెళ్లు వేసుకుని ఈత కొట్టిన విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: