ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన వీధి కుక్కలు రెచ్చిపోతూ దారుణంగా దాడులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కుక్క అనే పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరు వణికి పోయే పరిస్థితి కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల కేవలం వీధి కుక్కలు మాత్రమే కాదు పెంపుడు కుక్కలు కూడా ఇలాగే యజమానులపై లేదా ఇతరులపై దాడి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఏకంగా మనుషులకి కుక్కలకి మధ్య తరతరాల నుంచి జాతి వైరం కొనసాగుతుందేమో అన్న విధంగానే కుక్కలు వ్యవహరిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా పెంపుడు కుక్క దారుణంగా  ఎముకలు కనిపించేలా దాడి చేసింది. కానీ ఇలా కుక్క దాడి చేయడమే అతనికి వరంలా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఈ ఘటన యూకే లో వెలుగులోకి వచ్చింది. డేవిడ్ లిండ్సే అనే వ్యక్తి సోఫాలో మధ్య మధ్యలో నిద్రపోతున్నాడు. అతడు ఏడు నెలల బుల్ డాగ్ ను పెంచుకుంటున్నాడు. అయితే అతను నిద్రపోయిన సమయంలో అతని పెంపుడు కుక్క ఏకంగా కాలి బొటనవేలిని కొరికేసింది. ఇక నిద్రలేచిన అతను కాలి దగ్గర కుక్క ఏం చేస్తుందో చూసి షాక్ అయ్యాడు.



 కుక్క ఎందుకు ఇలా చేసిందో అర్థం కాక డేవిడ్ తో పాటు అతని భార్య అయోమయానికి గురవుతారు. అయితే కుక్క ఎముక బయటకు వచ్చేలా గాయం చేసిన అతనికి నొప్పి తెలియలేదు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు. తనకు డయాబెటిస్ వచ్చిందని.. శరీరంలో రెండు ధమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగ్గా సరిపడా కావడం లేదని వైద్యులు చెక్ చేసి అసలు విషయం చెప్పారు. అందుకే కుక్క గాయం చేస్తున్న తనకు స్పర్శ తెలియడం లేదు అన్న విషయం అతనికి అర్థమైంది. అయితే కుక్క దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. అందుకే తన పెంపుడు కుక్క చేసిన పని వరంలా మారిందని అతను చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: