ఉక్రెయిన్ , రష్యా దేశాల మధ్య దాదాపు గత ఏడాది నుంచి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ యుద్ధం కారణం గా ఇరుదేశాల్లో కూడా మారనహోమం జరుగుతుంది. ఇప్పటికే వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎలాగైనా చిన్న దేశమైన ఉక్రెయిన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న రష్యా.. యుద్ధాన్ని ప్రారంభించగా అటు ఉక్రెయిన్ కూడా రష్యా సేనలకు దీటుగానే బదులిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే ఏ క్షణం లో ఎటువైపు నుంచి బాంబు దాడులు జరుగుతాయో అని ఇరుదేశాల ప్రజలందరూ కూడా అనుక్షణం భయ పడుతూనే బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పరిస్థితుల్లో ఎక్కడా మార్పులు చేయడం లేదు అని చెప్పాలి. అయితే ఇక ఉక్రెయిన్ పై ఎలాగైనా బాంబుదాడులకు పాల్పడాలి అని నిర్ణయించుకున్న రష్యా అత్యుత్సాహంతో చివరికి సొంత దేశంలోనే ఒక నగరం లో మ బాంబు దాడికి పాల్పడిన ఘటన కాస్త సంచలనం గా మారి పోయింది.



 ఇలా ఉక్రెయిన్ పై ఏడాదిగా  యుద్ధం చేస్తున్న రష్యా ఇటీవల సొంత నగరం పైన పొర పాటున బాంబు దాడి చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యా నగరమైన బెల్గో రాడ్ పై ఓ యుద్ధ విమానం నుంచి బాంబు పడటం తో 40 మీటర్ల వ్యాసంతో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే అదృష్ట వశాత్తు  అక్కడ ఎవరు జనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు అని చెప్పాలి. అయితే ఈ ఘటనలో మాత్రం పలు భావనాలు కారులు ధ్వంసం అయ్యాయి. ఇలా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న ఈ నగరంలో నాలుగు లక్షల మందిజనాభా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: