మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మంచి క్రేజీ ఉందన్న విషయం తాజా సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తుంది. ఆయనకి మాక్సిమం ఎక్కడికి వెళ్లినా, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఘన స్వాగతమే దక్కుతుంది ఇప్పుడు. అలాగని మన భారతదేశంలో కూడా ఆయనకి మంచి క్రేజీ ఉంది. ఆయన స్పీచ్ లకు మరింత క్రేజ్ ఉంది. ఆయన బ్యాంకింగ్ రంగంలో అవ్వచ్చు, మరొక రంగంలో అవ్వచ్చు ఏ రంగంలో తీసుకున్నా ఆయన చేస్తున్న సంస్కరణల వల్ల ఆయనకి మంచి పేరు వస్తుందన్నట్లుగా తెలుస్తుంది.


అలాగని అందరూ ఆయనని అభిమానిస్తున్నారా అంటే కేవలం 60 శాతం మంది మాత్రమే అభిమానించినా ఆయన క్రేజ్ ఇలా ఉంది అంటున్నారు రాజకీయ నిపుణులు. మొన్న జి7 సదస్సుకు వెళ్ళినప్పుడు కూడా బైడెన్ లాంటి వ్యక్తి వచ్చి మన మోడీని ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా ఆయనకి ఘన స్వాగతం పలకడం మాత్రమే కాదు, ఆయనని బాస్ అని అంటూ ఆకాశానికి ఎత్తేశారు.


ఇక న్యూ గినియా కి సంబంధించిన ప్రధానమంత్రి అయితే ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే ఆయన మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీకి పాదాభివందనం చేయడానికి సిద్ధపడి మరీ తమకు నాయకత్వం వహించమని కోరడం జరిగింది. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద హాల్లో భారతీయులు వచ్చి అందరూ కూర్చుని ఉండగానే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీస్ బాస్ అని పిలవడం మన ప్రధాని నరేంద్ర మోడీ కు ఉన్న క్రేజ్ ను తెలిపే సంఘటన అయ్యింది.


ఇక ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత మోడీ అమెరికాకి వెళ్లబోతున్నారు అని తెలుస్తుంది. భారత దేశాన్ని పక్కన పెట్టాలనుకుంటున్న అమెరికాకు చైనా వల్ల మళ్ళీ భారత్ ను కలుపుకోక తప్పడం లేదు. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లే సందర్భంలో ఆయనకి రెడ్ కార్పెట్ స్వాగత సన్నాహాలు చేస్తున్నారట బైడెన్ వర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: