రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎంత తీవ్ర స్థాయి లో యుద్ధం జరుగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అయితే యుద్ధం మొదలై సంవత్సరకాలం గడుస్తున్న ఇంకా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకవైపు రష్యా మరోవైపు ఉక్రెయిన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా హోరా హోరీగా యుద్ధం కొనసాగిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం లో వేల మంది సైనికులు నేలకొరిగిన కూడా ఇరుదేశాల ప్రభుత్వాలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అయితే ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు సఫలం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది కుదరడం లేదు అని చెప్పాలి.



 వెరసి అటు ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే వివిధ దేశాల అధ్యక్షులు స్పందించి రష్యా ఉక్రెయిన్ చర్చల ద్వారా యుద్ధానికి  తెరదింపాలి అంటూ సూచిస్తున్న ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అయితే ఇక ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి.  ఏకంగా పరిస్థితులు చేయి దాటితే తాము అణ్వాయిదాలు ప్రయోగించేందుకు కూడా వెనకాడబోము అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.



 ఈ క్రమం లోనే ఉగ్ర దాడి కోసం ఇప్పటికే బెలారస్లో తొలి బ్యాచ్ అన్వాయిదాలను మొహరించాము అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టారు పుతిన్. రష్యా భూభాగాలకు ముప్పు ఎదురయింది అని భావిస్తే ఇక అణు ఆయుధాలను  ప్రయోగించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయబోము అంటూ స్పష్టం చేశారు. బెలరస్ తో మోహరించిన  అన్వాయుదాలు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలు అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేయగలవు అంటూ రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఒకవేళ రష్యా అన్వాయుధాలు ప్రయోగిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: