పరమత సహనం లేనటువంటి వారే ఇతర మతాల్లో లోపాల్ని ఎత్తి చూపుతారు.  అమెరికా పార్లమెంట్ లోని ఇద్దరు ముస్లిం సభ్యులు ఇటీవలి ప్రధాని మోదీ అమెరికా పర్యటనను విమర్శించారు. ఇండియాలో ముస్లింలకు భద్రత లేదని ఆరోపణలు చేశారు. మోదీ కావాలనే ముస్లింలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నరేంద్ర మోదీ పర్యటనను బాయ్ కాట్ చేస్తున్నట్లు చెప్పారు. భారత దేశంలో ముస్లింలకు రక్షణ లేదని అన్నారు.


మోదీ బహిరంగ సభలో పాల్గొనమని ప్రకటించారు. అయితే దీనిపై ఇండియాలోని ముస్లిం మత పెద్దలు అమెరికా పార్లమెంట్ లోని మోదీ పై విమర్శలు చేసిన ముస్లిం సభ్యుల వ్యాఖ్యలను ఖండించారు. ఇండియన్ ముస్లిం లీడర్ అతిఫ్ రషీద్ మాట్లాడుతూ... ఇండియాలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ముస్లింలు ఆనందంగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని భారత్ లో ముస్లింలు స్వేచ్ఛగానే ఉన్నారని ఇండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఆ ఇద్దరు సభ్యులకు సూచించారు. ఇండియాలో ఉన్న ముస్లింలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు.


అమెరికా పార్లమెంటు లోని ముస్లిం సభ్యులు చేసిన వ్యాఖ్యలు నిజం కావని అన్నారు. దీంతో ఇండియాలో ఎంతో మంది మోదీని అభిమానించే ముస్లింలు ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ రాజకీయాలు ఎంత చేసుకున్నా పరాయి దేశం వ్యక్తులు ప్రధానిని విమర్శించినపుడు ముస్లిం మత పెద్దలు స్పందించిన తీరు చాలా ప్రశంసనీయమని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పరమత సహనం అంటే ఎంతో మళ్లీ ఇండియా చూపించిందని అంటున్నారు.


భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇండియాలో అమలవుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎంతో మంది ఎన్నో రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం మనుషులు, మతాల మధ్య విబేధాలు సృష్టిస్తూ ఉంటాయి. దీనితో ఎక్కడో ఇండియాలో ముస్లింలకు రక్షణ లేదని వివిధ దేశాల్లోని వారు భావిస్తుంటారు. కానీ ఇలాంటి సమయంలోనే ముస్లింలు సరైన స్పందించడం సానుకూలమైన అంశమని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: