ఇటీవల కాలంలో మంచి ఉద్యోగాలు సాధించడం కోసం విద్యార్థిగా ఉన్న దశ నుంచి ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించడమే కాదు.. టెక్నాలజీ పై కూడా అవగాహన పెంచుకొని ఇక కెరియర్లో ఎంతో బాగా సెటిల్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఎప్పుడు మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచి వేతనం ఉంటే ఇక లైఫ్ ఎంతో హ్యాపీగా సాగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగం వస్తే ఎవరైనా చేస్తారా.


 ఊరుకోండి బాసు.. ఇంత చదువు చదివి పెంపుడు కుక్కని చూసుకునే ఉద్యోగం చేయడమేంటి అని అంటారు ఎవరైనా. కానీ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగంలో ఇచ్చే వేతనం గురించి తెలిస్తే మాత్రం.. ఇక చదువు గురించి పక్కన పెట్టేసి టక్కున ఉద్యోగంలో చేరిపోతారు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు కూడా చెల్లించలేని వేతనాన్ని ఇక్కడ పెంపుడు కుక్కను చూసుకునే ఉద్యోగికి చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా ఏడాదికి కోటి రూపాయల జీతం ఇవ్వనున్నారు.


 సాధారణంగా విదేశాల్లో పెంపుడు కుక్కలకు కేర్ టేకర్లను నియమించడం చాలా కామన్. అయితే అలాంటి ఉద్యోగాన్ని యూకే లో నివసిస్తున్న ఒక యుఎస్ బిలియనిర్ కుటుంబం ఆఫర్ చేసింది. దీనికోసం 127,227 డాలర్లు వేతనాన్ని ఆఫర్ చేసింది. అంటే భారత కరెన్సీలో ఒక కోటి కంటే ఎక్కువే. ఫుల్ టైం డాగ్ సిట్టర్ కోసం జాబ్ ఆఫర్ పోస్ట్ చేయగా.. దీనికి 400 మంది అప్లై చేసినట్లు ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఎంతోమంది నేటిజన్స్ తమ క్రియేటివిటీకి పదును పెట్టి.. ఈ జాబ్ ప్రకటనపై ఎన్నో మీమ్స్ సిద్ధం చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri