ఇటీవల కాలంలో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్న అన్ని కంపెనీలు కూడా ఇక అత్యుత్తమమైన టాలెంట్ ఉన్న వారికే ఉద్యోగాలను ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే వారిలో టాలెంట్ ఉందా లేదా అన్న విషయాన్ని ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ నిర్వహించి డిసైడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే కంపెనీ బయటకి పంపించడం ఒకవేళ ఉద్యోగంలో సక్సెస్ అయితే కంపెనీ లోపలికి పిలిచి ఉద్యోగం ఇవ్వడం లాంటిది చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఇలా ఉద్యోగం వెళ్లిన సమయంలో కమ్యూనికేషన్స్ స్కిల్స్.. ఇతరత్రా సాఫ్ట్వేర్ డెవలపింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూసేవారు.
ఒకవేళ ఇలాంటి వాటిపై అవగాహన లేకపోతే ఉద్యోగం ఇచ్చేవారు కాదు. కానీ ఇటీవల ఒక కంపెనీ మాత్రం ఏకంగా మాంసం తినని.. మద్యం అలవాటు లేని.. స్మోకింగ్ చేయని వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తాము అంటూ ప్రకటన చేసింది. చైనాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మా కంపెనీలో పని చేసేందుకు 51వేలు ఇస్తాము. కానీ అభ్యర్థులు మేం చెప్పిన కండిషన్స్ పాటించాలి. ఎవరి హక్కులను ఉల్లంఘించేందుకు ఈ కండిషన్స్ పెట్టలేదు. కంపెనీ కార్పొరేట్ సంస్కృతి కోసమే ఇలాంటి రూల్స్ పెట్టాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి వింతైన వినూత్నమైన కండిషన్స్ చూసి ఎంతోమంది అభ్యర్థులు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.