గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించాలంటే అంత సులభమైన విషయమా అని ఎవరినైనా అడిగితే.. ఊరుకోండి బాసు గిన్నిస్ వరల్డ్ రికార్డు అంత ఈజీ అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక తమ పేరును వరల్డ్ రికార్డుల్లో ఎక్కించుకుంటారు కదా అని సమాధానం చెబుతారు ఎవరైనా. అయితే ఒకప్పుడు ఇలా ప్రపంచ రికార్డు సృష్టించాలంటే ఇక ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఏదైనా కఠినమైన పని చేయాలి. అలా చేసి నిరూపించుకుంటేనే వరల్డ్ రికార్డ్ సాధించే అవకాశం ఉంటుందని అందరూ భావించేవారు.


 ఇక అప్పట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన వారు కూడా ఇలాంటి కఠినమైన పనులపై ఏళ్ల తరబడి సాధన చేసి ఇక వరల్డ్ రికార్డు సాధించేవారు. కానీ ఇప్పుడు కొంతమంది రోజు చేసే పనుల ద్వారానే గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ప్రతి ఒక్కరు రోజు చేసే పనులనే కాస్త వెరైటీగా చేసి ఇక ప్రపంచ రికార్డును సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు ఒక మహిళ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది. అయితే ఇలా ప్రపంచ రికార్డు సృష్టించడానికి సదరు మహిళ చేసిన పని తెలిస్తే ఇంత ఈజీగా వరల్డ్ రికార్డు సాధించవచ్చా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.


 ఇంతకీ ఆమె ఎలా గిన్నిస్ రికార్డు సృష్టించిందో తెలుసా.. కేవలం తేన్పుల ద్వారా. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది నిజంగానే జరిగింది. మనలో చాలామందికి ఆహారం తిన్నాక తేన్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి తీన్పులతోనే ఓ మహిళ గిన్నిస్ రికార్డు సాధించింది. యూఎస్ లోని మేరీ ల్యాండ్ కు చెందిన క్యూంబర్లీ కిమీలోలా బిగ్గరిగా శబ్దం చేస్తూ తేన్పు రప్పించింది. 107.3 డేసిబిల్స్ శబ్దంతో అతి బిగ్గరగా తేన్పు చేస్తూ.  ఇలా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏకంగా తొమ్మిది సెకండ్ల పాటు కంటిన్యూగా ఆమె తెన్పు తీయడం గమనార్హం. కాగా పురుషుల్లో ఈ రికార్డు ఆస్ట్రేలియా కు చెందిన నెవెల్లె షార్ప్ (112.7 డేసిబిల్స్) పేరిట ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: