ఏకంగా ఆహారాన్ని నిర్లక్ష్యంగా తయారు చేయడం వల్ల పాములు బల్లులు ఎలుకలు లాంటివి బయటపడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడో ఒక వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఇష్టంగా అతను పుట్టగొడుగుల సూప్ ని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. హాయిగా పార్సల్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు. కానీ అంతలో ఒక పెద్ద ఆకారం అందులో కనిపించింది. ఏంటో అని చూసి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. యూకే లోని కెంట్ లో ఈ ఘటన జరిగింది. సామ్ హేవాద్ అనే వ్యక్తికి చైనీస్ రెస్టారెంట్ కి వెళ్లి పుట్టగొడుగుల సూప్ ఆర్డర్ చేశాడు. అనంతరం పార్సెల్ తీసుకొని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి భోజనం చేద్దామని ఫ్రెండ్ తో పాటు కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పుట్టగొడుగుల సూప్ తాగడం మొదలుపెట్టారు. అయితే అంతలో ఒక విత ఆకారం కనిపించింది. ఏంటి అని చూస్తే అందులో ఒక తోక కనిపించింది. దానిని చూసిన తర్వాత అతను షాక్ అయ్యాడు. తోక పట్టుకుని పైకి లేపితే అది చిట్టెలుక అని అర్థమైంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు రెస్టారెంట్ కు ఫోన్ కొట్టాడు. కానీ రెస్టారెంట్ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అతను అసంతృప్తి చెందాడు.