
అమెరికాలో పని చేయించుకోవాలంటే 10లక్షలు ఇవ్వవలసి ఉంటే ఇక్కడ 2 లక్షలతో సరిపెట్టేయవచ్చు. అదే అమెరికా తీసుకెళ్లి పని చేయించాలంటే అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి భారత్ లో ఉన్న వాళ్లకే పని అప్ప చెప్పడం ద్వారా, ఖర్చు తగ్గించుకోవడం ద్వారా లాభాలను పొందాలని అనుకుంటుంది అమెరికా. ఇంకా చెప్పాలంటే అమెరికాకు సంబంధించిన ఆయుధ కంపెనీలు ఇలా భావిస్తున్నాయి.
ఈ విషయం అమెరికన్ మీడియానే చెప్పడం గమనార్హం. అమెరికాకు సంబంధించిన ఆయుధ కంపెనీలు ఇప్పుడు భారత్ బాటను పట్టబోతున్నాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా సహకరించబోతున్నారని తెలుస్తుంది. దీనిపై మన ప్రధాని నరేంద్ర మోడీతో సూచన ప్రాయంగా చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. మోడీ గాని ఇంకొకసారి అధికారంలోకి వస్తే కనుక అమెరికాకు సంబంధించిన అనేక ఆయుధ కంపెనీలు భారత్ కు తరలి వస్తాయి.
మరి అమెరికాకు లాభం ఏంటంటే తక్కువ ఖర్చు తోనే పవర్ ఫుల్ ఆయుధాలను తయారు చేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా వీలుగా వర్కర్స్ కూడా దొరుకుతారు. ఇంకొక లాభమేమిటంటే భారత్ కూడా ఆ ఆయుధాలను కొంటుంది. భారత్ ద్వారా ఆ ఆయుధాలను ఇతర దేశాలకు కూడా అమ్మవచ్చు. ఇప్పటి వరకు ప్రతి దేశం అమెరికా ప్రభుత్వం అనుమతిస్తే తమ ఆయుధాలను అమ్ముకోవాల్సి వస్తుంది. దాని వల్ల జాప్యం జరగడంతో వాళ్లకు లాభాలు తగ్గుతున్నాయట. దీంతో భారత్ ద్వారా అమ్మకాలు జరిగితే లాభాలు పొందవచ్చని అనుకుంటున్నారు.