సముద్రాలలో కృత్రిమ దీవులను సృష్టించి దాని చుట్టు పక్కలా ఉన్న ప్రాంతాలన్ని మావే అంటోంది చైనా. అయితే పక్కలో బెల్లంలా తయారైన చైనా పనులతో వివిధ దీవుల దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమెరికాకు సంబంధించిన డ్రోన్లు, యుద్ధ నౌకలను జపాన్ కు ఇచ్చి దానితో ఎటాకింగ్ చేయించడానికి దానితో పాటు అమెరికా సైతం చైనాపై యుద్ధం చేయడానికి సిద్ధపడుతోంది.


అయితే చైనా పసిపిక్ మహా సముద్రం మొత్తం తనదే అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం తైవాన్ కూడా చైనాలో అంతర్భాగమని వాదిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అయితే ఈ విషయంలో అమెరికా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే చైనా ఒక వేళ యుద్ధం చేస్తే తైవాన్ కు సాయం చేసేందుకు అమెరికా యుద్ధ నౌకలను పసిపిక్ మహా సముద్రంలో దించుతోంది. సై అంటే సై అనేలా చర్యలు చేపడుతున్నారు.


మొత్తం మీద మరో యుద్దం రాబోయే రోజుల్లో జరగనుందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం తాము ఒప్పుకోమని డ్రాగన్ కంట్రీ చెబుతూనే ఉంది. అయితే ఈ సారి చైనాను ఎలాగైనా కట్టడి చేయాలని లేకపోతే ప్రపంచంలో అమెరికా పెద్దన్న పాత్ర చైనా తీసుకుని దాని చుట్టు పక్కల ఉన్న అన్ని దేశాలను స్వాధీనం చేసుకుని మరో బ్రిటన్ లా ప్రవర్తించడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం చైనాకు దాని చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలతో అన్నింటితో వివాదాలు ఉన్నాయి. కాబట్టి చైనాకు దాని చుట్టు పక్కలా దేశాలకు అస్సలు పడటం లేదు. కాబట్టి చైనా ను ఎలాగైనా కట్టడి చేయాలని అమెరికా భావిస్తోంది. తైవాన్ విషయంలో అమెరికా, చైనాను యుద్ధం చేస్తే ప్రపంచంలో ఏం జరగబోతుంది. రష్యా చైనాకు సపోర్టు చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది. దీనిపై వివిధ దేశాల్లోని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: