మనకి వేదాలు సకల విజ్ఞాన సర్వస్వం. ఈ వేదాలలో మన నిత్య జీవితాల్లో ఉపయోగపడే విషయాలన్నిటికీ సంబంధించిన శాస్త్రాలను మన ఋషులు ఎప్పుడో చెప్పడం జరిగింది.  శాస్త్రవేత్తలు ఈ బైనాక్యులర్స్ లాంటి సాంకేతిక పరికరాలు కనుగొనక మునుపే ఎప్పుడో వేద కాలంలోనే ఋషులు ఈ శాస్త్రాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తమ దివ్య దృష్టితో సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరాన్ని, అలాగే చంద్రమానాలను డిగ్రీలతో సహా వాళ్లు చెప్పగలగడం మన భారత దేశ ఋషులు సాధించిన విజ్ఞాన సంపత్తికి నిదర్శనం.


ఆ తర్వాత కాలంలో కూడా సాధారణ జీవన విధానంలో ఈ లెక్కలు కట్టడం అనేది నోటితోనో, చేతితోనో చేస్తూ వాడుతూ ఉండేవారు. అప్పటి వ్యాపారాలలో గుమస్తాలు ఇలాంటి లెక్కలు అనేవి ఎటువంటి క్యాలిక్యులేటర్లు వాడకుండానే గణిస్తూ ఉండేవారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత అది  మనిషికి ఎంత ఉపయోగపడుతుందో, మనిషి సామర్థ్యాన్ని కూడా అంతే తక్కువ చేస్తుంది అని అంటున్నారు మేధావులు.


రాను రాను ఈ గణన ప్రక్రియ కోసం క్యాలిక్యులేటర్ అనేది వాడడం జరుగుతుంది. దాని వల్ల చిన్న చిన్న మొత్తాలను కూడా సొంతంగా గణించడం మాని వేశారు జనం. ఇప్పుడు షాపుల్లో చూసినా, ఏ వ్యాపారాల్లో చూసినా కూడా చిన్న మొత్తాలకు కూడా క్యాలిక్యులేటర్ నే వాడడం జరుగుతుంది. ఈ రకంగా మనిషి తన మేధోసంపత్తిని వాడడం మెదడుకు పని చెప్పడం తగ్గించేశాడు. అయితే ఇప్పుడు ఇదే సమస్య అమెరికా దేశాలకు సంబంధించిన విద్యార్థులపై అధిక ప్రభావం చూపుతుందని అంటున్నారు.


అమెరికాకు చెందిన విద్యార్థులు ఇప్పుడు చాలా వరకు గణిత శాస్త్రంలో వెనకబడి ఉంటున్నారని అంటున్నారు నిపుణులు. అక్కడ గణిత శాస్త్రానికి సంబంధించిన ఉపాధ్యాయుల అవసరం ఉందని తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ దగ్గర నుండి సెమీకండక్టర్స్ తయారీ వరకు గణిత విజ్ఞాన అవసరం ఉంది. కానీ అమెరికాలో ఆ నాలెడ్జ్ అనేది  విద్యార్థులకు తగ్గిపోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: