నేటి రోజుల్లో మనీ లేనిదే మనిషి జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయం కూడా మనీతోనే ముడిపడి ఉంది. మనీ లేకపోతే ఏంటి మంచి మనసుంటే చాలు అని అందరూ అంటూ ఉంటారు. కానీ అందరికీ కావాల్సింది మాత్రం.. మన అవసరాలు తీర్చుకోవడానికి.. కడుపు నింపుకోవడానికి చేతిలో డబ్బులు ఉండాల్సిందే. కానీ బతకాలి అంటే మనీతో అవసరం లేదు అన్న విషయాన్ని నేటి రోజుల్లో నిరూపించాడు యూకే కి చెందిన మార్క్ బాయ్ అనే వ్యక్తి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లుగా చిల్లి గవ్వ కూడా లేకుండా అతను సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు.


 ఇలా 2008 నుంచి అతను డబ్బు లేని జీవన శైలిని గడుపుతున్నాడు. టెక్నాలజీని కూడా పూర్తిగా విస్మరించి చాలా సింపుల్ గా ప్రకృతి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పండ్లు కూరగాయలను మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. అయితే మార్క్ అంతకుముందు బిజినెస్ అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీలో కళాశాల పట్టా పొందాడు. తర్వాత యూకే బ్రిస్టల్ లోని ఆర్గానిక్ ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో కూడిన జాబ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇందుకు పూర్తికి భిన్నంగా జీవిస్తున్నాడు. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ డబ్బులు లేకుండా జీవిస్తున్నాడు .


 2007లో అతనిలో మార్పు వచ్చింది. ఒకరోజు రాత్రి అతని హౌస్ బోట్ లో గ్లాస్ ఆఫ్ మోర్లాట్ అనే ఒక ఫిలాసఫర్తో ఏర్పడిన పరిచయం అతన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ప్రపంచంలో ఉన్న చాలా సమస్యలకు డబ్బే మూలం అని ఇక అతను అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా బీ ద చేంజ్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అనే గాంధీ కొటేషన్ గుర్తుకొచ్చింది. ఒకవైపు ఫిలాసఫర్ ఆలోచన ఇంకోవైపు గాంధీజీ కొటేషన్ అతని ఎంతగానో ప్రభావితం చేసాయ్. అప్పటినుంచి డబ్బులు లేకుండా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఖరీదైన హౌస్ బోట్ ను విక్రయించి పాత క్యారవాన్ లోకి మార్చాడు. ఈ క్యారవాన్ కూడా డబ్బుతో కొనలేదు. అతనిలో మార్పును చూసి ఎవరో విరాళంగా ఇచ్చారట. అయితే ప్రకృతి నుంచి ఉచితంగా పొందగలిగే ఆహారాలతో జీవించాల్సి వచ్చినందుకు మొదట్లో కాస్త ఇబ్బంది పడిన తర్వాత అలవాటు పడ్డాడు. ఇక ఆ తర్వాత మనీ లెస్ మాన్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు మార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి: