
ఇలా మనిషి సాధారణ జీవన శైలిలో మార్పులు రావడానికి కారణమయ్యే వ్యాధుల లో ఫోబియా కూడా ఒకటి. ఈ ఫోబియాల లో ఎన్నో రకాల ఫోబియాలో ఉంటాయి. చాలా మంది ఇలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది వాటర్ ఫోబియా తో బాధ పడతారు. ఇక వాళ్ళు ఎక్కడికైనా ఎక్కువగా నీళ్లు ఉన్నచోటికి వెళ్లారు అంటే చాలు తెలియకుండానే గుండెల్లో అలజడి మొదలవుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఎత్తయిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు.. మరి కొంతమంది చీకట్లో ఉన్నప్పుడు లేదా పాములు బల్లులు జంతువులు లాంటివి చూసినప్పుడు భయపడటం జరుగుతూ ఉంటుంది.
ఇక ఇలాంటి ఫోబియా నుంచి బయటపడటానికి డాక్టర్ల సలహా తీసుకుంటూ ఉంటారు ఎంతోమంది వ్యక్తులు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వింతైన ఫోబియా తో బాధపడుతున్నాడు. అదే ఉమెన్ ఫోబియా. రువాండాలో నాజంవిటా అనే 71 ఏళ్ళ వ్యక్తికి ఆడవాళ్లు అంటే విపరీతమైన భయం. దీంతో 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు సదరు వ్యక్తి. ఏకంగా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన ఒక కంచెను నిర్మించుకున్నాడు. ఇలాంటి భయాన్ని గైనో ఫోబియా అంటారట. ఇక ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారు మహిళలను చూసినప్పుడు గుండే వేగంగా కొట్టుకోవడం శ్వాసలో ఇబ్బంది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది.