టిక్ టాక్.. ప్రస్తుతం భారత్లో ఈ పేరు తెలియని నేటిజన్ లేడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ యాప్ ఇండియాలో ఎంటర్టైన్మెంట్ పంచింది కొన్నాళ్లే.. అయినా ఆ కొన్నాళ్లలోనే ఇండియాను మొత్తం ఊపేసింది. అందుబాటులోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రతి ఒక్కరిని కూడా బానిసలుగా మార్చేసుకుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా టిక్ టాక్ అనే మాయలో మునిగితేలారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక తమలో ఉన్న నటన టాలెంటును ఈ టిక్ టాక్ ద్వారా నిరూపించుకుని సెలబ్రిటీ హోదా కూడా సంపాదించారు. కానీ తర్వాత అనూహ్యంగా చైనాకు చెందిన ఈ యాప్ ద్వారా భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి అన్న కారణంతో అటు భారత ప్రభుత్వం ఈ యాప్ పై నిషేధం విధించింది.



 ఆ సమయంలో ఎంతోమంది చిత్ర విచిత్రంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత్ సహా మరికొన్ని దేశాలలో కూడా  టిక్ టాక్ యాప్ నిషేధం కొనసాగుతూ ఉంది. కానీ కొన్ని దేశాలలో మాత్రం ఈ యాప్ పై అనుమతి ఉంది. అయితే గత కొంతకాలం నుంచి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా టిక్ టాక్ యాప్ పై చర్యలు తీసుకుంటూ ఇక నిషేధం విధిస్తూ వస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కి ఒక భారీ షాక్ తగిలింది.


 ఏకంగా గత నెలలో టిక్ టాక్ లోని 40 లక్షల వీడియోలను యూరోపియన్ యూనియన్ డెలిట్ చేసింది. ఇకపోతే ఇటీవల కొత్త డిజిటల్ సేవలు చట్టం యూరప్ లో అమల్లోకి వచ్చింది అని చెప్పాలి. ఇందులో భాగంగా చట్ట విరుద్ధమైన హానికరమైన కంటెంట్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.. అంతేకాకుండా నిబంధనలు పాటించని ఆన్లైన్ ప్లాట్ఫారంలు, సెర్చ్ ఇంజన్లకు భారీ జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒకవేళ రానున్న రోజుల్లో టిక్ టాక్ తీరు మార్చుకోకపోతే ఆ యాప్ పై ఇక యూరోపియన్ యూనియన్ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: