ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు.. ఇక మొత్తం నీరసంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఒక్కరోజు నిద్ర లేకపోతేనే పరిస్థితి ఇలా ఉంటుంది. అలాంటిది రెండు మూడు రోజులు కనీసం కంటిమీద కునుకు లేకుండా మేలుకుని ఉంటే వామ్మో ఆ ఆలోచన తట్టుకోలేం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నిద్రపోవడం లేదట. నిద్రపోవడం లేదు అంటే ఏదో ఒకటి రెండు రోజులు అనుకునేరూ.. ఏకంగా 62 ఏళ్లుగా అతను కంటిమీద కునుకు లేదట. ఒక్కరోజు కూడా అతను నిద్రపోలేదట. వినడానికే విచిత్రంగా ఉంది కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. వియత్నాంకు చెందిన వ్యక్తి ఇలా ఏకంగా 62 ఏళ్లుగా నిద్ర లేకుండానే బ్రతికేస్తూ ఉన్నాడట.
రాత్రి పగలు అనే తేడా లేకుండా అతను మేలుకొనే ఉంటాడట. థాయ్ ఎన్ గాగ్ అనే 80 ఏళ్ల వ్యక్తి 62 ఏళ్లుగా నిద్రపోవట్లేదట. 1962లో ఓసారి అతనికి జ్వరం వచ్చింది. అయితే జ్వరం నుంచి కోలుకున్న తర్వాత అతనికి పూర్తిగా నిద్ర పట్టడం ఆగిపోయిందట. ఇదే విషయంపై అతను వైద్యులను సంప్రదిస్తే అది ఇన్ఫోమేనియా అని వైద్యులు తెలిపా.రు అయితే దీనికి ఎన్ని హాస్పిటల్ల చుట్టూ తిరిగినా అతనికి పరిష్కారం లభించలేదు. క్రమక్రమంగా అతను నిద్ర లేకుండా బ్రతకడానికి అలవాటు పడిపోయాడు. అయితే నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ అతనికి 62 ఏళ్లతో నిద్ర పోకపోయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం లేదట.