అయితే పెళ్లి విషయంలో కొన్ని ప్రాంతాలలో ఆచరించే వింతైన ఆచారాలు సాంప్రదాయాలు అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. నేటి ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి వింతైన అనాగరిక ఆచారాలను పాటించే మనుషులు ఉన్నారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక విచిత్రమైన ఆచారం గురించే. దక్షిణ పసిఫిక్ లోని ట్రిబియాండ్ దీవుల్లో పెళ్లి విషయంలో అక్కడి తెగ ప్రజలు ఒక వింత ఆచారాన్ని పాటిస్తారట. అక్కడ దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగల ప్రజలు జీవిస్తున్నారు.
అయితే కొన్ని శతాబ్దాల కిందట వారి పూర్వీకులు వాడిన ఆచారాలను ఇప్పటికి కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారట అక్కడి ప్రజలు. సాదరణంగా పెళ్లి చూపుల సమయంలో ఒకరిని ఒకరు చూసుకోవడం ఇక పెళ్లికి ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరి భావాలను ఒక అర్థం చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రిబియాంట్ దీవుల్లోని ప్రజలు మాత్రం వింత ఆచారాన్ని పాటిస్తారట. ఏకంగా యువతిని చూడ్డానికి వెళ్లిన యువకుడు ముందుగా ఆమె చాతిని చూస్తాడట. ఒకవేళ ఆమె ఛాతి గనక నచ్చకపోతే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోవచ్చట. ఇలా ఏకంగా యువతి యొక్క ఛాతి మీద ఆధారపడే అక్కడి పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయట. ఇలాంటి వింతైన ఆచారం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.