భారత పొరుగు దేశమైన పాకిస్తాన్ తో ఇక ఎప్పుడు శత్రుత్వం కొనసాగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు మాత్రమే ఇరుదేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త  పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. కానీ పాకిస్తాన్, ఇండియా సరిహద్దుల మధ్య మాత్రం ఎప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అయితే పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ఏకంగా పాకిస్తాన్. ఉగ్రదేశంగా పేరుగాంచిన పాక్ ఏకంగా ఉగ్రవాదులకు కొమ్ముకాస్తూ దేశ ప్రయోజనాలను సైతం గాలికి వదిలేస్తూ ఉంటుంది పాకిస్తాన్.


 ఇలా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు అందరూ కూడా ఇండియాపై ఎప్పుడు దాడి చేస్తారో అన్న విధంగా ఉంటుంది పరిస్థితి. ఈ క్రమంలోనే పాకిస్తాన్, ఇండియా సరిహద్దులో సైన్యం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎన్నోసార్లు ఉగ్రవాదులు ఏకంగా సాధారణ పౌరుల లాగానే ఇండియాలోకి వచ్చి.. బాంబు దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కు శత్రుదేశం గా కొనసాగుతున్న ఇండియాలోనే కాదు ఏకంగా సొంత దేశంలోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సొంత సైనికులనే హతమార్చడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి నెలకొంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల పాకిస్తాన్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.


 పాకిస్తాన్లోని నార్త్ వజీరిస్తాన్ లో సెక్యూరిటీ చెక్పోస్ట్ పై ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏకంగా ఏడు రంగులు ఆర్మి అధికారులతో పాటు ఆరుగురు టెర్రరిస్టులు కూడా మరణించారు. అయితే టెర్రరిస్టులు పేలుడు సామాగ్రితో కూడిన వాహనంతో వచ్చి చెక్పోస్టును ఢీ కొట్టి పేల్చేశారు. తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా సైనికులు కాల్చేశారు. ఇక తర్వాత అప్రమత్తమైన పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతాన్ని మొత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఉగ్రవాదులు ఏకంగా తమకు వెన్నుదన్నుగా నిలిచే పాకిస్తాన్ ఆర్మీ పైనే దాడులు చేసి వారి ప్రాణాలు తీయడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: