ఎండాకాలం వచ్చింది అంటే ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు జనాలు. అయితే ఎంతలా ఫ్యాన్లు, ఏసీల ముందు కూర్చున్న సూర్యుడి ఎండల భగభగ మందు ఏవి ఉపశమనాన్ని కలిగించవు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎండాకాలంలో ఉండే ఉక్కబోతకు కనీసం రెండుసార్లు అయినా స్నానం చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో ఎంతోమందికి నీటి విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎండాకాలంలో బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఇక నీటి ఎద్దడి ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఉక్కపోత కారణంగా రెండుసార్లు స్నానం చేయడం కాదు.. కనీసం రోజుకు ఒక్కసారి కూడా స్నానం చేయలేని పరిస్థితులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మొన్నటికి మొన్న మోడ్రన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ నీటి ఎద్దడి కారణంగా ప్రజలందరూ అల్లాడిపోయారు. రోజుకు ఒకసారి కాదు వారానికి ఒక్కసారి మాత్రమే స్నానం చేసే పరిస్థితి అక్కడ ఏర్పడింది. రోజువారి అవసరాలకు కూడా నీళ్లు లేని దుస్థితి వచ్చింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు కొలంబియాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందట. దేశ రాజధాని బోగట్ట లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే ఇక బొగట్ల సిటీ మేయర్ కార్లోస్ ఫెర్నాండో గాలన్ నీటి కొరత నేపథ్యంలో అటు ప్రజలకు వింత సూచన చేశారు   ప్రస్తుతం నగరంలో తీవ్ర నీటి కొరత ఉందని.. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కాకుండా దంపతులు ఇద్దరు కలిసి స్నానం చేయాలని.. తద్వారా నీరు కాస్త ఆదా అవుతుంది అంటూ సలహా ఇచ్చారు  అంతేకాకుండా హాలిడేస్ లో లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళని నేపథ్యంలో ఆరోజు స్నానం చేయకుండా ఉండాలని సూచించారు.  చరిత్రలో ఎనోడు లేని విధంగా నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పవు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: