ఇంకొంతమంది ఏకంగా ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ప్రేమను కొనసాగిస్తూ ప్రేమ అనే పదానికి ఒక అర్థం లేకుండా చేసేస్తున్నారు. మరి కొంతమంది చిన్న చిన్న కారణాలకే ఒకరితో బ్రేకప్ చెప్పేసి మరొకరితో ఇక ప్రేమాయణం మొదలుపెట్టడం లాంటివి చేస్తున్నారు. నేటి రోజుల్లో ఎక్కడ చూసిన ప్రేమలు ఇలాగే మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నేటి రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందా అంటే దొరుకుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పడం కూడా చాలా కష్టమే. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాగే ట్రూ లవ్ కావాలి అనిపించింది. దీంతో ట్రూ లవ్ కోసం ఏకంగా 70 ఏళ్ల వరకు ఒంటరిగానే ఉండిపోయాడు సదరు వ్యక్తి.
చివరికి 70 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ వృద్ధుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరి జీవితానికి స్వస్తి పలకాలి అనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రహదారులపై హోర్డింగ్స్ పెట్టి వార్తల్లో నిలిచాడు. ఆయనే అమెరికాలోని టెక్సాస్ నివాసి అయిన ఆల్ గిలిబర్తి. అయితే ఆయన యాడ్స్ చూసి ఎంతో మంది యువతూలు కాల్స్ చేస్తున్నారట. అయితే ఇలా కాల్స్ చేసిన అమ్మాయిలు అందరూ కూడా డబ్బు సహాయం అడుగుతున్నారని.. కానీ తన ప్రేమను అర్థం చేసుకోవట్లేదని చెబుతున్నాడు సదురు వ్యక్తి. తన హృదయాన్ని మెచ్చే యువతి నుండి మాత్రం కాల్ రాలేదు అని చెబుతున్నాడు నిజమైన ప్రేమ దొరికితే ఎక్కడికైనా వెళ్లెందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ అంటున్నాడు.