ఈ విధానంలో వారు తమ కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాలని చూస్తుంటారు. అయితే ఇలాంటి చదువుకునే విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇటీవల చదువుకునే విదేశీ విద్యార్థుల డిపాజిట్ ను భారీగా పెంచిన అక్కడి ప్రభుత్వం.. మరో కొత్త రూల్ అమలుకు సిద్ధమైంది. దీంతో విదేశీ విద్యార్థులకు ఆప్ క్యాంపస్ లో ఇక వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు తాత్కాలిక నిబంధన ప్రకారం గరిష్ఠంగా 40 గంటల వరకు పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ట్రూడో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. కరోనా సమయంలో దేశంలో శ్రామిక శక్తి కొరతను తగ్గించేందుకు ట్రూడో ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులు వారానికి గరిష్ఠంగా 40 గంటలు పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సడలింపు గతేడాదితో ముగిసినా.. ఏప్రిల్ 2024 వరకు పొడిగించారు. ఇకపై దానిని పొడిగించకూడదని ట్రూడో సర్కారు నిర్ణయించింది.
వారానికి 28 గంటలు కన్నా ఎక్కువ పనిచేసే విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే విదేశీ విద్య కోసం అమెరికా తర్వాత ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అక్కడ 3,19,130 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. విదేశీ విద్యార్థులు కెనడా కు క్యూ కడుతున్న నేపథ్యంలో ట్రూడో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురావడం గమనార్హం.