ఈ మధ్యకాలంలో జనాలు అందరూ కూడా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ తోనే ఆలోచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా ఇక మర్యాద  ఇవ్వడం పుచ్చుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే చాలు వారిపై ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కొన్ని కొన్ని సార్లు దాడులు చేయడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 అయితే ఇలా ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో ఇక ఇలా ఒక వ్యక్తి సర్ అని అని సంబోధించినప్పుడు ఇక అది అమితమైన మర్యాద ఇచ్చిన కిందికే వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక మరో వ్యక్తిని సర్ అని పిలవడం వారితో సర్ అని పిలిపించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా సర్ అని పిలవడమే అతని పాలిట శాపంగా మారిపోయింది. అదేంటి సర్ అని పిలిచి గౌరవం ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు అతనికి చేదు అనుభవం ఎదురయింది అని అనుకుంటున్నారు కదా. అతను ఎయిర్పోర్టులో సర్ అని పిలిచాడు. అయితే ఇలా పిలిచింది అబ్బాయిని కాదు అమ్మాయిని.


 దీంతో ఇలా అమ్మాయిని సర్ అని పిలిచిన కారణంగా అతనికి అధికారులు షాక్ ఇచ్చారు. యూఎస్ లోని టెక్సాస్ కు చెందిన లాంగోరియా అనే వ్యక్తి తన కుటుంబీకులతో కలిసి ఆస్టిన్ వెళ్లే విమానం ఎక్కాడు. అయితే విమానం ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చిన వ్యక్తిని పురుషుడిగా భావించిన సదరు వ్యక్తి థాంక్యూ సార్ అంటూ సంబోధించాడు. కానీ అక్కడ ఉన్నది మాత్రం ఒక మహిళ.  దీంతో తనను సర్ అన్నందుకు ఆగ్రహించిన సదరు మహిళా లాంగోరియా కుటుంబాన్ని ఫ్లైట్ నుంచి దించేశారు. సారీ చెప్పిన కూడా వారు వినిపించుకోలేదు. అయితే బాధితులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: