ఈ భూమిపై కోట్లాది జీవరాసులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ జీవరాసుల్లో దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. అయితే ఈ భూమి మీద ఉండే కొన్ని జీవరాసులు ఏకంగా చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలకు ఆధారాలుగా కూడా ఉంటాయి అని చెప్పాలి. ఇక అలాంటి జీవులు ఎప్పుడైనా కనిపించాయి అంటే చాలు గత చరిత్రకు చెందిన ఆనవాలు లభించాయి అని ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు.  ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అరుదైన జీవి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 భారతదేశపు పొరుగును ఉన్న శ్రీలంక దేశం ఒక ద్వీపం అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాకి శ్రీలంకకి మధ్య ఎన్నో ఏళ్ల నుంచి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాలు ఒకప్పుడు ఒకటిగానే ఉండేవి అని అనుమానం చాలా మంది శాస్త్రవేత్తల్లో కలిగింది. ఇక దీనిపై ఎన్నో పరిశోధనలు కూడా చేశారు అని చెప్పాలి.  ఇది నిజమే చరిత్రపుటల్లో ఇండియా శ్రీలంక అనేవి వేరు వేరు కాదని ఒకప్పుడు కలిసే ఉండేవి అన్న విషయం ఇటీవలే ఒక జీవి ద్వారా బయటికి వచ్చింది. అయితే ఇలా చరిత్రకు ఆధారంగా నిలిచిన జీవి ఏదో కాదు కప్ప అని చెప్పాలి. అదేంటి కప్ప కనిపించడం ద్వారా ఇలా శ్రీలంక, భారత్ కలిసే ఉండేవి అన్న విషయాన్ని ఎలా నిపుణులు తేల్చారు అని ఆశ్చర్యపోతున్నారు కదా.


అసలు విషయంలోకి వెళ్తే.. కేవలం శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన శ్రీలంకన్ స్యుడో ఫెతేరాస్ అనే జాతి కప్ప ఇటీవల శేషాచడం అడవుల్లో దర్శనమిచ్చింది. అయితే దీనికి సంబంధించిన వివరాలను జీవవైవిద్య మండలి పరిశోధకులు వెల్లడించారు. శ్రీలంకలో నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే వేల సంవత్సరాల క్రితం శ్రీలంక భారత్ భూభాగాలు కలిసి ఉండేవి అనే థియరీ కి ఇక ఈ కప్పే ఆధారం అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: