సాధారణంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ మాన్లు లేదంటే సంపన్నులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టార్ హోటల్స్ లో బస చేయడం చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇలా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే స్టార్ హోటల్స్ లో ఉండడానికి భారీ మొత్తంలోనే రెంట్ చెల్లించడం కూడా చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఎంత మొత్తంలో ఇలా హోటల్ రూమ్  రెంట్ చెల్లించారు అన్న విషయం ఒక్కోసారి బయటకు వస్తూ అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఒక్క రోజుకి ఇంత భారీ మొత్తంలో చెల్లిస్తారా అని అనుకుంటూ ఉంటారు.


 కానీ ఏకంగా ప్రపంచంలోనే కాస్లీ హోటల్ ఏది అన్న విషయం మాత్రం అందరు పట్టించుకోరు. ఇక ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ కూడా కాస్త కాస్లీ గానే ఉంటాయని ఇక్కడ ఎవరు బసచేసిన లక్షల్లో చెల్లించాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్లో ఒకటిగా గుర్తింపును సంపాదించుకుంది అట్లాంటిస్ ది రాయల్. మరోసారి ఈ కాస్లి హోటల్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ హోటల్ ప్రత్యేకమైన డిజైన్ కారణంగా వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ కు ఎంపిక చేయబడటంతో మరోసారి ఈ ఖరీదైన హోటల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.


 దుబాయిలో నిర్మించిన ఈ హోటల్ కం రిసార్ట్ ను అమెరికన్ ఆర్కిటెక్ట్ కో ఫెడరన్స్ పాక్స్ రూపొందించారు. దాదాపు 20.83 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హోటల్ నిర్మాణం జరిగింది. ఇందులో 795 గదులు, 131 నివాసాలు నిర్మించబడ్డాయి అన్నది తెలుస్తోంది. అరేబియా సముద్రం ఒడ్డున ఈ హోటల్ ఉంటుంది. అయితే ఈ హోటల్లో ఒక్కరోజు బస చేయడానికి ఎంత మొత్తంలో చెల్లిస్తారు అన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఏకంగా ఒక్క రాత్రి బస చేయడానికి సుమారు లక్షల డాలర్లు చెల్లించాలట. అంటే భారత కరెన్సీలో 83 లక్షల రూపాయలు చెల్లించాలి అని చెప్పాలి. కాగా ఈ ఖరీదైన హోటల్ ప్రారంభోత్సవానికి అమెరికన్ పాప్ సింగర్ బయోన్స్ నీ ఆహ్వానించారు. అతను ఒక్క గంట ప్రదర్శనకు ఏకంగా 290 కోట్లు వసూలు చేశాడు. ఇక ఈ హోటల్లోని ప్రతి 11,840 చదరపు  అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. నాలుగు బెడ్ రూములు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ తో పాటు ప్రతి అతిధికి ప్రైవేట్ సర్వీస్ కూడా అందించబడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: