సాధారణంగా మనిషి అంటే అటు మానవత్వానికి జాలి దయ అనే కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. సాటి మనిషికి అపాయం వచ్చింది అంటే చాలు అయ్యో పాపం అంటూ తోచినంత సహాయం చేసే వాడే మనిషి. అందుకే భూమ్మీద ఉన్న మిగతా జీవులతో పోల్చి చూస్తే మనిషి ప్రత్యేకమైన జీవి అంటూ ఉంటారు. ఇక పరిస్థితులకు తగ్గట్లుగా విచక్షణతో మెలుగుతూ ఉంటాడు మనిషి. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మాత్రం మనుషులు ఏకంగా మృగాల కంటే దారుణంగా మారిపోయారు అనే విషయం అర్థం అవుతుంది.


 మరీ ముఖ్యంగా కొంతమంది చూడటానికి మనిషి పుట్టుక పుట్టారు. కానీ ఏకంగా అప్పుడెప్పుడో పురాణాల్లో చెప్పుకునే రాక్షస జాతికి చెందిన వారేమో అనే భావన కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే మనుషుల్లా కాదు రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎంతోమంది జనాలు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక రాక్షసుడు గురించే. అతను చూడ్డానికి మనిషిలాగే ఉంటాడు. కానీ చేసే పనులన్నీ కూడా రాక్షసుడు కంటే భయంకరంగా ఉంటాయి. ఏకంగా మనుషులను కాదు జంతువులను సైతం వదలకుండా రేప్ చేస్తాడు. అంతేకాదు దారుణంగా బంధించి హింసిస్తూ రాక్షసానందం పొందుతూ ఉంటాడు.


 ఈ క్రమంలోనే ఇటీవలే అతనికి ఏకంగా కోర్టు 249 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆస్ట్రేలియాలో 60 కి పైగా కుక్కలను రేప్ చేసి చంపినందుకు జువాలజిస్ట్ ఆడం బ్రిటన్ కు కోర్టు ఏకంగా 249లో జైలు శిక్ష విధించింది. అతడు కుక్కలను కొట్టి చంపి తన క్రూరత్వాన్ని వీడియోలో తీసేవాడు. కుక్కలను హింసించేందుకు అతను షిప్పింగ్ కంటైనర్ ను టార్చర్ రూమ్ గా ఉపయోగించేవాడట. అతడి లాయర్ కొత్త నివేదిక కోర్టుకుఇవ్వడంతో దీనిపై ఆగస్టులో విచారణ జరపనున్నారు అని చెప్పాలి. ఈ నరరూప రాక్షసుడు గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: