పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక వయసుకు వచ్చిన తర్వాత యువతి యువకులు ఇద్దరు కూడా పెళ్లి అనే బంధంతో ఇక మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటూ ఉంటారు  ఈ క్రమంలోనే తమను అర్థం చేసుకునే భాగస్వామి.. భర్త లేదా భార్యగా వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని చెబుతూ ఉంటారు. అందుకే పెళ్లి విషయంలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. అంతేకాదు ఇక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా వివాహం చేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం.


 అయితే పెళ్లి గురించి తెలియాలంటే ఎవరైనా ఏం చేస్తారు.. పెద్దలను అడిగి పెళ్లి బంధం గురించి తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. వేదమంత్రాల  సాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త లేదా భార్య ఒకరితో ఒకరు ఎలా మెసులుకోవాలి.. సమస్యలు వచ్చినప్పుడు ఎలా సర్దుకుపోవాలి.. ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను పెద్దవాళ్ళను అడిగి తెలుసుకుంటారు. కొంతమంది సొంత అనుభవాలతో ఇది నేర్చుకుంటూ ఉంటారు  కానీ ఇప్పుడు అలా కాదు ఏకంగా పెళ్లి గురించి తెలుసుకోవాలంటే ఒక డిగ్రీ కోర్సు పూర్తి చేయాల్సిందే. అదేంటి పెళ్లిపై డిగ్రీ కోర్స్.. వినడానికి కొత్తగా ఉంది అనిపిస్తుంది కదా.


 చైనాలో ఇలాంటి రూల్ తీసుకువచ్చింది అక్కడ ప్రభుత్వం. చైనాలో జననాల శాతం పడిపోవడంతో పెళ్లిపై ఒక డిగ్రీ కోర్సును ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్గా పేరు పెట్టింది. పౌర వ్యవహారాల విశ్వవిద్యాలయంలో వచ్చే నెల నుంచి ఈ కోర్సు మొదలు కాబోతుంది. 12 ప్రావిన్సుల నుంచి 70 మంది అండర్ గ్రాడ్యుయేట్లకు తొలి ఏడాది అడ్మిషన్ ఇవ్వనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఈ డిగ్రీ కోర్స్ పూర్తి చేసిన వారికి వివాహ్య సంబంధిత రంగాలలో ఉద్యోగాల కేటాయింపులు కూడా ఉంటాయని అక్కడి ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: