ప్రపంచాన్ని సైతం భయం గుప్పెట్లోకి నెట్టిన కరోనా వైరస్ కూడా అటు చైనా సృష్టే అని చెప్పాలి. ఏకంగా ముందుగా కరోనా వైరస్ చైనాలో పుట్టింది. కానీ ఈ వైరస్ కు సంబంధించిన నిజాలు దాచడంతో చివరికి ఈ ప్రాణాంతకమైన ప్రపంచ దేశాలకు పాకిపోయి అందరిని భయాందోళనకు గురిచేసింది. అయితే అక్కడ ఆహారం తినే విషయంలోనే కాదు.. ఏకంగా పంటలు పండించే విషయంలో కూడా ఇలాంటి విచిత్రమైన పద్ధతులనే పాటిస్తూ ఉంటారు అన్న విషయం ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ద్వారా అందరికీ అర్థమవుతుంది.
ఎందుకంటే అక్కడ అల్లం సాగు చేయడం కోసం.. రైతులందరూ కూడా వినూత్నమైన కాదు కాదు విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు భూమిలో అల్లం కొమ్ములతో పాటు చనిపోయిన చేపలని కూడా వేసి పూడ్చుతూ ఉన్నారు. అది కుళ్లిపోయి ఎరువుగా మారి.. భూమికి మంచి సారాన్ని ఇస్తుంది అని ఇక అక్కడి రైతులు చెబుతున్నారు. అల్లం ఘాటు కూడా బాగుంటుంది అంటూ రైతులు చెబుతూ ఉండడం గమనార్హం. చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిలువ చేసుకుంటున్నారట అక్కడి రైతులు. దీంతో చైనాలో అల్లం కి సమానంగానే అటు చనిపోయిన చేపలకి కూడా గిరాకీ పెరుగుతూ ఉండడం గమనార్హం.