దీంతో ఈ స్నేహబంధం నేపథ్యంలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయుల విషయంలో అంత కఠినమైన ఆంక్షలు ఉండే అవకాశం లేదు అని అందరూ అంచనా వేశారు. కానీ ట్రంప్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంపై ఇక ఇప్పుడు ఇండియాలో అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ అధికారం చేపట్టిన తొలి రోజే భారతీయులను తీవ్రంగా దెబ్బతీస్తే ఉత్తర్వులపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ట్రంప్ మొదటి సంతకం ప్రభావం ఏకంగా అమెరికాలోని 10 లక్షల మందిపై ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డ్ ఉన్నవారికి పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలో ఉంటున్న భారత సంతతి వారికి అమెరికాలో ఉన్నప్పుడు పుట్టపిల్లలందరికీ అమెరికా పౌరసత్వం వస్తుంది. అయితే తల్లిదండ్రులు అమెరికా పౌరులు కానిపక్షంలో వారి పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం ఇచ్చే నిబంధనలను మార్చుతూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక పాత పద్ధతికి స్వస్తి పలుకుతారని చర్చ జరుగుతుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారి పిల్లలకు మాత్రం అమెరికా పౌరసత్వం రాదని ఇన్నాళ్లు భారతీయులు భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే తయారైన నమూనా నిబంధనలను చూస్తూ ఉంటే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు అమెరికాకు చెందినవారు అమెరికా పౌరునిగా తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన తీసుకురాబోతున్నారట ట్రంప్. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఏకంగా 10 లక్షల భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.