డొనాల్డ్ ట్రంప్ హోరా హోరీగా జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి తన సత్తా చాటారు. 78 ఏళ్ల వయసులో, కీలక రాష్ట్రమైన విస్కాన్సిన్‌లో విజయం సాధించి ట్రంప్ గెలుపుకు కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఆయనకు ఎక్కువ ఓట్లే వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ మిగతా అధ్యక్షుల కంటే ఎప్పుడు చాలా హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఆయన ఒక వ్యాపారవేత్త ఇప్పుడు రాజకీయ వేత్తగా మారారు. కానీ ఆయన ఒక మంచి యాక్టర్ అని కూడా మీకు తెలుసా? ఈ అగ్రరాజ్య అధ్యక్షుడు 1980ల నుంచి సినిమాలు, టీవీ షోలు, ప్రకటనలలో అనేక అతిధి పాత్రలు చేస్తూ చాలా అలరించారు. ఆయన బుల్లితెర, వెండితెరలపై కనిపిస్తూ తరచుగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఆయన నటించిన కొన్ని సినిమాల వివరాలు తెలుసుకుందాం.

1. గోస్ట్స్ కాంట్ డూ ఇట్ (1989)లో ట్రంప్ ఒక చిన్న సన్నివేశంలో కనిపించారు. ఈ రొమాంటిక్ కామెడీలో అతను ఒక మహిళకు వ్యాపార సలహా ఇస్తారు.

2. హోమ్ అలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్ (1992) ఫిల్మ్‌లో కూడా డోనాల్డ్ ట్రంప్ మెరిసారు. ఇందులో  మెకాలే కుల్కిన్ పోషించిన కెవిన్ మెక్‌కాలిస్టర్‌ ప్లాజా హోటల్‌కి వెళ్తారు అక్కడ ఓనర్ అయిన డొనాల్డ్ ట్రంప్‌ను డైరెక్షన్స్ కోసం అడుగుతాడు. ఆ సమయంలో, ట్రంప్ కెవిన్‌కు ఆయన వెళ్లాల్సిన గమ్యస్థానానికి సరైన డైరెక్షన్స్ చెబుతారు.

3. ది లిటిల్ రాస్కల్స్ (1994)లో ట్రంప్ ప్రధాన పాత్రలలో ఒకరికి రిచ్ ఫాదర్ గా నటించారు. ఆ పాత్ర పేరు వాల్డో జాన్స్టన్ II. ఒక ఫన్నీ సీన్‌లో , అతను ఫోన్‌లో, “వాల్డో, డబ్బుతో కొనగల ఉత్తమ కుమారుడు నువ్వు” అని చెబుతారు.

4. అక్రాస్ ది సీ ఆఫ్ టైమ్ (1995) అనే ఫ్యామిలీ అడ్వెంచర్ ఫిల్మ్‌లో, న్యూయార్క్ నగరాన్ని సందర్శించిన ఒక యువకుడికి ట్రంప్ నమస్కరించారు.

5. ది అసోసియేట్ (1996)లో ట్రంప్ హూపీ గోల్డ్‌బెర్గ్‌తో కలిసి వ్యాపార సన్నివేశంలో కొన్ని సెకన్లు కనిపిస్తారు.

6. స్టూడియో 54 (1998)లో సెలబ్రిటీలతో నిండిన పార్టీలో ట్రంప్ అతిధి పాత్రలో కనిపించారు.

7. వుడీ అలెన్ దర్శకత్వం వహించిన సెలబ్రిటీ (1998) చిత్రంలో ట్రంప్ ఇతర ప్రముఖులతో కలిసి ఒక న్యూయార్క్ ఈవెంట్‌లో దర్శనమిస్తారు.

8. జూలాండర్ (2001)లో ట్రంప్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.

9. టు వీక్స్ నోటీసు (2002)లో ట్రంప్ ఒక ఛారిటీ బాల్ వద్ద కొంతసేపు కనిపిస్తారు.

10. వాల్ స్ట్రీట్: మనీ నెవర్ స్లీప్స్ (2010)లో ట్రంప్ తన పాత్రను తానే పోషించారు.

ఈ చిత్రాలతో పాటు, ఎడ్డీ, POM వండర్‌ఫుల్ ప్రెజెంట్స్: ది గ్రేటెస్ట్ మూవీ ఎవర్ సోల్డ్, స్మాల్ పొటాటోస్: హూ కిల్డ్ ది USFL వంటి ఇతర ప్రాజెక్ట్‌లలో కూడా ట్రంప్ అతిధి పాత్రలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: