తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడంతో.. జనాల్లో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని భయాలు, అనుమానాలు నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అమెరికాలో తీసుకురానున్న మార్పుల నేపథ్యంలో అమెరికన్లు ముందస్తుగానే జాగ్రత్తలు పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అవును, ఇందులో భాగంగానే ట్రంప్ విజయం తర్వాత ఒక్కసారిగా అక్కడ అబార్షన్ ట్యాబ్లెట్లకు భారీగా డిమాండ్ పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధిస్తే, మహిళలకు ఉన్న అబార్షన్ హక్కులను తొలగిస్తారని వదంతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అబార్షన్ ట్యాబ్లెట్ల కొనుగోళ్లు ఒక్కసారిగా అమాంతం పెరిగినట్లు సంబంధిత వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అబార్షన్ పిల్స్ కోసం అమెరికన్లు.. మెడికల్ షాపుల ముందు క్యూలు కడుతున్నట్టు సమాచారం. 24 గంటల వ్యవధిలోనే 10 వేల మందికి పైగా ఈ అబార్షన్ ట్యాబ్లెట్ల కోసం ఆర్డర్ చేసినట్లు అక్కడి మీడియా అధికారికంగా వెల్లడించడం కొసమెరుపు.

ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే అబార్షన్ ట్యాబ్లెట్ల కోసం గర్భిణీలతోపాటు గర్భం దాల్చని వారు ఎక్కువగా ఎగబడుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. గర్భం రాని మహిళలు ముందస్తు ప్రిస్కిప్షన్‌ కోసం సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీవో తెలిపింది. అదేవిధంగా అక్కడి ఎన్నికలకు ముందే అబార్షన్ ట్యాబ్లెట్లు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాల కోసం రోజూ 4వేల నుంచి 4500 మంది తమ వెబ్‌సైట్‌ చూసేవారని.. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీటిని చూసేవారి సంఖ్య అమాంతం పెరిగిందని సమాచారం. అలా ఇప్పుడు ఒక్క రోజులోనే 82 వేల మందికి పైగా వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారని భోగట్టా. అబార్షన్ ట్యాబ్లెట్లతోపాటు గర్భ నిరోధక పరికరాలు, వేసక్టమీ ఆపరేషన్ల గురించి కూడా తెలుసుకునేందుకు అమెరికన్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: