ఇక ప్రతిరోజు ఇలాంటి పిల్లులను చూస్తూనే ఉంటామ్. ఈ మధ్యకాలంలో అయితే పిల్లులను పెంపుడు జంతువులు గా పెంచుకోవడం కూడా ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. దీంతో ప్రతి ఇంట్లో కుక్కలతో పాటు పిల్లలను కూడా పెంచుకుంటున్నారు. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే పిల్లి ఏ సైజు ఉంటుంది అనే విషయం అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పిల్లి మాత్రం ఎంతో అరుదైనది. ఇది అన్ని పిల్లుల్లాంటి పిల్లి కాదు అత్యంత చిన్నది. ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి గురించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
దీంతో ఇప్పటికే పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకుంటున్న వారందరూ కూడా ఈ అతి చిన్న పెళ్లి గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఇల్లీ నాయిస్ కి చెందిన టింకర్ టాయ్ అనే పిల్లి 2.75 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది. 7.5 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. ఇల్లినాయిస్ పిల్లి 3.1 పౌండ్లు. 6.1 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు పిల్లులు కూడా ప్రపంచంలోనే అతి చిన్న పిల్లులుగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సృష్టించాయి అని చెప్పాలి. వామ్మో పిల్లులు ఎలా ఉంటాయో తెలుసు కానీ మరి ప్రపంచంలో ఇంత చిన్న పిల్లలు కూడా ఉన్నాయా అని ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.