మన దేశంలో తొమ్మిదేళ్ల బాలికకు పెళ్లి చేయడాన్ని బాల్య వివాహంగా భావిస్తారు. అంటే ఇది చట్టరిత్య నేరం. అయితే ఇక ఎవరికి తెలియకుండా రహస్యంగా బాలికకు పెళ్లి చేసి చివరికి ఆ బాలిక గర్భం దాల్చితే.. దానిని చట్ట ప్రకారం ఏకంగా అత్యాచారంగానే భావిస్తూ.. పెళ్లి చేసుకున్న వ్యక్తిని శిక్షించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం మరోలా జరుగుతుంది. ఏకంగా 9 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు కుటుంబ సభ్యులు ఏకంగా ఆమె గర్భం దాల్చడంతో సెలబ్రేషన్స్ కూడా చేశారు. అదేంటి 9 ఏళ్ల బాలిక గర్భం దాల్చితే షాక్ అవ్వాల్సింది పోయి సెలబ్రేషన్స్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా.


 ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన ఇరాక్ లో జరిగింది. ఇటీవల అక్కడ బాల్యవివాహాలు కూడా చట్టబద్ధం చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఏకంగా అమ్మాయిల పెళ్లి వయసును 9 ఏళ్లకు మార్చేందుకు కూడా రెడీ అయింది. అయితే మొన్నటికి మొన్న ఇలాంటి చట్టం తీసుకురాబోతున్నారు అన్న విషయాన్ని తెలిసి అందరూ షాక్ లో మునిగిపోయారు. ఇక ఇప్పుడు ఏకంగా తొమ్మిదేళ్ల బాలిక గర్భం దాల్చడం.. ఇక సెలబ్రేట్ చేసుకోవడం ఇదంతా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఏకంగా తొమ్మిదేళ్ల బాలిక పెళ్లి చేసుకోవడమే కాదు గర్భం కూడా దాల్చింది. ఇక ఇలా గర్భం దాల్చిన క్షణాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఇలా ఇరాక్ లో తీసుకువచ్చిన చట్టం, అక్కడ జరుగుతున్న ఘటనలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో బాలల హక్కుల ఉల్లంఘన పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇరాక్ లో చాలామంది పిల్లలు ప్రాథమిక పాఠశాల చదువుకునే వయస్సులోనే వివాహం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి ఘటనల గురించి తెలిసి ఇంటర్నెట్ జనాలు కూడా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: