అయితే ఇక్కడ ట్రంప్ ఇచ్చిన హామీ ఆయనకు ఎన్నికల్లో ఓట్లు పడటానికి ఎంతో ఉపయోగపడింది. కాగా ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన హామీ నీరు గారి పోయే విధంగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది. మరో 60 రోజుల్లో కుర్చీ నుంచి దిగిపోబోతున్న బైడెన్ పెద్ద చిచ్చే పెట్టారని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎంత తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అగ్రరాజ్యమైన అమెరికాకు శత్రుదేశంగా రష్యా కు పేరు ఉంది. దీంతో మొదటి నుంచి రహస్యంగా అటు ఉక్రెయిన్ కి మద్దతు ప్రకటిస్తూ వస్తుంది అమెరికా.
ఇక ఇప్పుడు ఈ మద్దతు విషయంలో బహిరంగంగానే సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఉక్రెయిన్ కి అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైల్ లను రష్యా పైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్మిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ దేశం పైకి అమెరికాకు సంబంధించిన మిస్సైల్స్ వస్తే రష్యా ఊరుకోబోదు అంటూ అంచనా వేస్తున్నారు. అయితే ఇక ఈ యుద్ధం నాటో దేశాలకు విస్తరిస్తుంది అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఇప్పటికే నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఆయా దేశాల పౌరులకి ఇక ఈ విషయంపై నిత్యవసరాలు ఔషధాలు నిలువ ఉంచుకోవాలని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.