అయితే ఇలా బోన్ లో బంధించిన జంతువులను చూసి ఆనంద పడటం ఇష్టంలేని కొంతమంది వైల్డ్ లైఫ్ లవర్స్ ఏకంగా సఫారీ వాహనాల్లో సింహాలు పులులు ఉండే అడవుల్లోకి వెళ్లడం చూస్తూ ఉంటాం. ఏకంగా సింహాలను నేరుగా చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఇలాంటి సఫారీ వైల్డ్ లైఫ్ గురించి కాదు జంతు ప్రదర్శనశాల గురించి. కానీ అందరికీ తెలిసిన జంతు ప్రదర్శనశాల ఇక్కడ ఉండదు. ఇక్కడ అంతా రివర్స్. సాధారణంగా ఏ జూలో అయినా సరే జంతువులను బంధించి మనుషులను స్వేచ్ఛగా వదిలేసి.. వారు ఎక్కడబడితే అక్కడ తిరగడానికి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో ఉంటుంది.
మనుషులను బోన్ లో బంధిస్తారు. కానీ సింహాలు పులులు లాంటి క్రూర మృగాలను స్వేచ్ఛగా వదిలేస్తారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఇక్కడ ఇదే రూల్. వింతైన అనుభూతి కోసం ఇలాంటి రూల్ పెట్టారు జూ నిర్వాహకులు. చైనాలోని ఒక జూలో జంతువులను వదిలేసి సందర్శకులను బోన్ లో బంధిస్తారు. దీనిని రివర్స్ జూ అని కూడా పిలుస్తారు. జంతువులను స్వేచ్ఛగా వదిలేయడం వల్ల వాటి సహజ ప్రవృత్తిని చూడొచ్చు. సాంప్రదాయ జూ అనుభవానికి భిన్నంగా ఉన్న ఈ రివర్స్ జూ ఎంతోమంది సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇందులో రూల్స్ ఎలా ఉంటాయి. అనుభూతి ఎలా ఉంటుంది అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది