కొన్ని రోజులుగా సాక్షి టీవీ రాజధాని శంకుస్థాపనపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న హడావిడిని విమర్సిస్తూ కథనాలు రాస్తూనే ఉంది. అనవసరంగా దాదాపు 400 కోట్లు ఖర్చు  చేస్తున్నారని హంగామా చేసింది. వీటితో ప్రత్యేక హోదాను పక్కకు పెట్టిన వైనాన్ని కూడా కథలు కథలుగా రాసుకొస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి శంకుస్థాపనలో మోడీ పెద్దగా ఎలాంటి హామీలు కురిపించలేదు. 

సాధారణంగా ఇలాంటి సిట్యుయేషన్ ను సాక్షి బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రాజనాన్ని దగా చేసిందని రెచ్చిపోవాలి. దానికి తగ్గట్టుగా ప్రసారాలు రూపొందిస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ విచిత్రంగా ఈ అంశాన్ని టీవీ9 అందిపుచ్చుకుంది. శంకుస్థాపన సభలో నరేంద్రమోడీ మట్టి, నీరు తప్ప ఏమీ ఇవ్వని వైనాన్ని టీవీ9 హైలెట్ చేసింది. 

ఏపీ నోట్లో ఢిల్లీ మట్టి అంటూ క్యాప్షన్ పెట్టి చెడుగుడు ఆడేసింది. అది కూడా చాలా ఫాస్ట్ గా ఈ పని చేసింది. మోడీ స్టేజ్ దిగి అలా తిరుపతి బాట పట్టేలోగానే టీవీ9 ఈ రకం బాదుడు మొదలుపెట్టింది. సహజంగా సాక్షి చూపించాల్సిన స్పీడ్ ను టీవీ 9 చూపించింది. అప్పటివరకూ ఆహా.. ఓహో అమరావతి అంటూ సాగిన ప్రచారం.. మోడీ ప్రసంగం తర్వాత సీన్ మారిపోయింది. 

జనం పల్స్ ను త్వరగా పసిగట్టడంలో తాను మరోసారి నెంబర్ వన్ అని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. మోడీ అంతగా జలక్ ఇచ్చాక కూడా ఇంకా అమరావతి జపం చేయడంలో ఎలాంటి ఫలితం ఉండదని బాగానే గ్రహించింది. అంతే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా మోడీపై దూకుడు పెంచేసింది. ఎంతైనా నెంబర్ వన్ ఛానల్ కదా.. ఆ ఎక్స్ పీరియన్స్ బాగానే ఉపయోగపడి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: