ఊహించినట్టుగానే పార్లమెంట్ వర్షకాలం సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాయి. అయితే గత రెండేళ్ల కాలంగా పలు ముఖ్యమైన బిల్లులను అడ్డుకుంటూ వస్తున్న ప్రతిపక్షాలు మాత్రం ఈ సారి అడ్డగించే లక్ష్యం ప్రస్తుతానికి లేదన్న మాట నిజం. తొలివారం విరుచుకుపడినా మలి వారం లో ప్రతపక్షాలన్నీ బిల్లుకు మద్దతినిస్తాయన్న ఆశాభావం తో ఉంది కేంద్ర సర్కార్. గత దశాబ్దాలుగా రగిలి పోతున్న కశ్మీర్ విషయం పై ప్రతిపక్షాల వ్యతిరేకత ఉంటుందని భావించిందే. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కాకముందే ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష భేటిలో ప్రతిపక్షాలను ఆకట్టుకునే ప్రయత్రం చేశారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అరుణా చల్, కశ్మీర్ పరిణామాలపై పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు?
పలు అంశాలపై వాడివేడి చర్చ జరగనున్న నేపథ్యంలో ఇతర అంశాలను ప్రాముఖ్యం ఇవ్వడం కన్నా జాతీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బిల్లులకు యోగ్యత ఆధారంగా తాము మద్దతు ఇస్తామని తెలియజేసింది. జీఎస్టీ పై ఆ పార్టీ మాత్రం ఎటువంటి హామీని ఇవ్వలేదు. తాము లేవనెత్తిన ఆందోళనపై లిఖిత పూర్వక ముసాయిదా ను ప్రభుత్వం తమకు ఇచ్చిన తరువాతే ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అంటే దీనిని బట్టి చూస్తే దాదాపుగా కాంగ్రెస్ సైతం ఈ సారి జీఎస్టీ బిల్లుకు పెద్దగా అడ్డుచెప్పకపోవచ్చు. అయితే సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా కశ్మీర్ పై వాడ వేడీ చర్చ జరిగింది. కశ్మీర్ క్షేత్రస్థాయిలో అవసరాన్ని మించిన బలాన్ని వాడటం, మిలిటెంట్ల కూ, స్థానికులకూ మధ్య తేడాలేనట్టుగా భద్రతాదళాల అమానుషత్వానికి నిదర్శనంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న చిత్రాలు ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.
అధికార పక్షాన్ని వదిలిపెట్టే అవకాశాలు లేవు...
వీలైనన్ని ఆంశాల్లో కక్ష తీర్చుకోకుండా అధికార పక్షాన్ని విపక్షాలు వదిలిపెట్టే అవకాశాలు లేవు. 356 వ అధికరణ దుర్వినియోగం మీద ప్రతిపక్షాలతో సహా కొన్ని మిత్రపక్షాలు కూడా విరుచుకుపడాలనుకోవడం ప్రభుత్వానికి ఇరకాటమే. ఉత్తరాఖండ్ విషయంలో నోరు మెదపలేకపోయినా... అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం లో ఎదురుదాడికి అధికారపక్షానికి కాస్తంత వీలున్నది. ఒకపక్కన కశ్మీర్ మండుతుండగా... ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని ఉమ్మడి పౌరస్మృతి తుట్టెను ప్రభుత్వం కదపడంపై విమర్శలు తప్పవు. అణు సరఫరా దేశాల గ్రూప్ (ఎన్ఎస్జీ) వ్యవహారంలో వైఫల్యం కంటే... దానికి పాలకపక్షం ఇచ్చిన అధిక ప్రాధాన్యం, విస్తృత ప్రచారం ఇప్పుడు సభలో విమర్శలకు వీలుకలిపిస్తున్నది. వైద్య విద్యలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా పరీక్ష నీట్ రాకతో రెండు ఆర్డినెన్స్ ల స్ధానంలో వచ్చే బిల్లులకు అడ్డంకులు ఎలాగూ ఉండవు.
సుష్మా స్వరాజ్, వసుందరరాజే, శివరాజ్ చౌహన్ రాజీనామా కు డిమాండ్...
ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశ పెట్టి ప్రభుత్వం పరీక్షకు సిద్దపడుతున్నది. రాజ్యసభ లో బలంలేని కారణంగా కొన్నది ప్రధాని బిల్లులు నిలిచిపోయి నేపథ్యంలో , మొన్నటి ఎన్నికలతో విపక్షాన్ని చీల్చి చక్రం తిప్పగలిగే అవకాశాలు అధికారపక్షానికి పెరిగాయి. డిసెంబర్ శీతాకాల సమావేశాల్లోనూ, ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లోనూ రాజకీయ పక్షాల కళ్ళన్నీ సమీపిస్తున్న ఎన్నికల మీదే ఉంటాయి. రాజీలకూ, ఏకాభిప్రాయాలకూ ఇక ఏ మాత్రం అవకాశాలు లేవు. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లు ఆమోదం విషయంలో ఇబ్బంది ఏర్పడుతుందని నరేంద్రమోడీ ప్రభుత్వం అసలు ఉహించలేదు. అందుకనే 2016 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలు చేయబోతున్నామని బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టక ముందే ఆర్ధిక మంత్రి ఆరుణ్ జైట్లీ ధీమాగా ప్రకటించారు. తొలుత వర్షాకాల సమావేశాల్లో సుష్మా స్వరాజ్, వసుందర రాజే, శివరాజ్ చౌహన్ తదితరుల రాజీనామాలు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాలను జరగనివ్వక పోవడంతో ఈ జీఎస్టీ బిల్లు ఆగిపోయింది.
వెంకయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్...
దాంతో ఈ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం సంకేతం ఇచ్చింది. అందుకు కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా సంసిద్దత ను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వారి ఆగ్రహం తెప్పించాయి. ఒక వంక ఈ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు కోరుతూనే కాంగ్రెస్ ఇప్పుడు తాము ఓడిపోయామని నిజం ఒప్పుకుని, నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారని అంగీకరించాలి అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ బిల్లును అడ్డుకున్నాయి. దీంతో గత వేసవి కాల సమావేశాల్లోనే కీలకమైన భూసేకరణ, జీఎస్టీ బిల్లులను ఆమోదించుకుండానే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ముగిశాయి. అనేక కీలక బిల్లులు, పెండింగ్ బిల్లులకు ఈ సమావేశాల్లో మోక్షం లభించినా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూసేకరణ, జీఎస్టీ బిల్లులు మాత్రం పెండింగ్ లో పడిపోయాయి.
జీఎస్టీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు...
ఇకపోతే త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఒక ఉత్తరప్రదేశ్ లో పార్టీ గెలిచిదంటే ఉత్తర భారతదేశం పూర్తిగా తమ ఆదీనం లోకి వస్తుందన్న నమ్మకం గతం నుంచి ఉంది. అందువల్ల.. ఈ వర్షకాల సమావేశాల్లోనే అవసరమైన బిల్లులను గట్టెక్కించుకోవాలి. జనతాదళ్, సమాజ్ వాదీ, బీఎస్సీ ఇత్యాది ప్రాంతీయ పార్టీల అధినేతలను దువ్వేపనిలో సీనియర్ బీజేపీ నేతలు తలమూకలై ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఎంపీ లు జీఎస్టీ బిల్లు కు పూర్తి గా మద్దతునిస్తామని ఆ పార్టీ వ్యవహారాల నేత జితేందర్ రెడ్డి ప్రకటించారు. విపక్షాలన్నింటినీ కాంగ్రెస్ తో కలిసికట్టుగా అన్ని అంశాలపై విరుచుకుపడనిచ్చి, జీఎస్టీ బిల్లు విషయంలో మాత్రం కాంగ్రెస్ ను ఒంటరి చేసే కృషి బలంగా సాగుతున్నది.
జీఎస్టీ బిల్లు ససేమిరా అంటున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటింగ్ సమయంలో సభ నుంచి నిష్క్రమించేట్టు చూసి, కాంగ్రెస్ లొంగిరాకున్నా ఇబ్బందిలేని పరిస్థితులను సృష్టించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం. విపక్షాలను రెచ్చగొట్టుండా, సంఘటితం కాకుండా, రచ్చ సుదీర్ఘకాలం కొనసాగుకుండా ప్రభుత్వం చూడగలిగినప్పుడే ఈ వ్యూహం నేరవేరుతుంది. ఈ విజయం అధికారపక్ష వ్యవహారశైలి మీదే పూర్తిగ ఆధారపడి ఉంటుంది. మరీ ఎలాంటి వ్యూహాలు వేయనుందో, జీఎస్టీ బిల్లును ఎలా గట్టేక్కిస్తుందో చూడాలి....