Image result for gandikota rahasyam images

సినీరంగ ప్రవేశం

నందమూరి తారక రామారావు క్లుప్తంగా ఎన్.టి.ఆర్.  కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటి కీ వాటిని భరిస్తూనే జీవించే వారు కాని అప్పు చేసేవాడు కాదు.

Image result for senior ntr photos

రామారావు 1947 లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడు గా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండ లేకపోయాడు.

DVS Karna Duryodhana images కోసం చిత్ర ఫలితం

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటో ను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి "పల్లెటూరి పిల్ల" సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావు కు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలు అవ్వలేదు. ఈ లోగా "మనదేశం" అనే సినిమాలో అవకాశం రావడంతో దాని లో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949 లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950 లో "పల్లెటూరి పిల్ల" విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు "షావుకారు" కూడా విడుదలైంది.

Image result for senior ntr photos

ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. 'థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతం' లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.  1951లో కె.వి.రెడ్డి 'పాతాళభైరవి' దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి 'మల్లీశ్వరి' 1952లో ఎల్వీ ప్రసాదు 'పెళ్ళిచేసి చూడు', ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం 'చంద్రహారం' ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయా వారివే. ప్రతీ సినిమాకు నెలకు రూ.500/- రూపాయిలు జీతం మరియు రూ.5000 /- రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టిం చింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు నందమూరి.

Related image

1956లో విడుదలైన 'మాయాబజార్‌' లో ఆయన తీసుకున్న రూ.7500/- రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావి స్తారు. 1959 లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన 'భూకైలాస్' చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960 లో విడుదలయిన 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం' భారీ విజయం సాధించింది. దానితో రామా రావి ప్రజలకు దైవస్వరూపుడే అయ్యాడు. మద్రాస్ వెళ్ళిన ప్రతి ఆంధృదు ఒక్కసారైనా రామారావు ను చూడకుండా తిరిగిరాని ఆచారం ఉంది.

Related image

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961 లో విడుదలైన "సీతారామ కళ్యాణం". ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. ఈ సినిమా చూసిన కంచి పీటాధిపతి రావణాసురుని పాత్రలో రామరావు ప్రాణప్రతిష్ఠ చేసిన తీరు అనితరసాధ్యమని అన్నారు. ఆయనే రామా రావు గారిని " విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని ప్రశంసించారు. అదే ఆయన పేరుకు ప్రిఫిక్స్ అయింది.

Image result for senior ntr photos

ఎన్.టి.ఆర్ మూడు పాత్రలు పోషించి కృష్న, కర్ణ, సుయోధన పాత్రల్లో త్రిపాత్రాభినయం చెసి దర్శకత్వం వహించిన సినిమా 1977 లో విడుదలైన "దాన వీర శూర కర్ణ". 1978 లో విడుదలైన "శ్రీరామ పట్టాభిషేకం" సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన "బ్రహ్మర్షి విశ్వామిత్ర" 1990లో విడుదలైంది. 'శ్రీమద్విరాటపర్వము' లో ఆయన ఐదు పాత్రలు పోషించాడు.

Related image

ఆ విధంగా 1950 లలో చిత్ర రంగ ప్రవేశం చెసిన ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పుననటిస్తూ ఉండేవాడు. 1963 లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమా ల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.


ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితత్వం పాతించే వారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచ్ లో అభ్యాసం చేసేవాడు. "నర్తనశాల"  సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చు కున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడ బడిన దాఖలాలు లేవని చెబుతూ ఉన్టారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందు గానే కంఠతా పట్టేసేవాడు అనర్ఘళంగా సంభాషణలు ఆయన నోటి నుండి సెలయేళ్ళ లాగా, బ్రహ్మపుత్ర అంత భీకరంగా, గంగా ప్రవాహం హృద్యమంగా ప్రవహించేవి.

రాజకీయరంగ  ప్రవేశం

Image result for senior ntr photos

1978 లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసుపార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నికచేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.

Image result for senior ntr photos

1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్స రాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగుప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.

అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చి నప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్తపార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు "తెలుగుదేశం" గా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత షవర్లే  వ్యాను ను బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదిక గా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసం గాలు చేసేవాడు. దానిని ఆయన "చైతన్యరథం" అని అన్నాడు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారతరాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి.

ప్రభంజనంగా అధికారంలోకి  

Image result for senior ntr photos

ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడి వలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉప న్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల "ఆత్మగౌరవ పరిరక్షణ" అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.  తొమ్మిది నేలల కాలంలోనే రామారావు వేసిన “రాజకీయ బీజం”  చిగురించి అంకురించి మహా వటవృక్షమే అయింది.

ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం, అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు.

Image result for senior NTR

కాంగ్రెసు నాయకులు "కుక్కమూతి పిందెలు"  "కొజ్జాలు" "దగాకోరులు" , "దగుల్బాజీలు" "అధిష్టానం చేతిలో కీలుబొమ్మలు" అంటూ - తీవ్రపదజాలంతో విమర్శించాడు. కాంగ్రెసుపార్టీ కారణంగా తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ  "ఆత్మగౌరవ పునరుద్ధరణ" కే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు ఆయన నినాదం పట్ల పూర్తిగా  ఆకర్షితులయ్యారు.

1983 జనవరి  7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీచేతుల్లో కూకటివేళ్ళతో సహా కూలిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతగానో తోడ్పడ్డాయి. 

రాజకీయంగా జీవితపరంగా ఉత్థాన పతనాలు  

Image result for senior ntr photos

1970 లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి, ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతం గా, అప్రతిహతంగా సాగిపోయింది. అయితే ఆయన రాజకీయ జీవితం అలా - నల్లేరు పై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్  కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణల కారణంగానూ, ఎన్నికల్లో తెలుగుదేశం చేతి లో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వల్లనూ, ఆ రెండు పార్టీల మధ్య వైరి భావం పెరిగింది. రాజకీయ పార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాకుండా రెండింటి మధ్య శతృత్వ భావన నెలకొంది.ఇది తెలుగు దేశం పాలిత ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. "కేంద్రం మిథ్య"  అనేంత వరకు ఎన్టీఆర్ వెళ్ళాడు.

Image result for senior NTR

1983 శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధాన మైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్ కౌటిల్యం తో, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావు ను అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం లో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న, సరిగ్గా నెలరోజులకు నాదేళ్ళ భాస్కరరావు ను సింహాసం పైనుండి కూలద్రోసి "నెలరేడు" గా మార్చి తాను మళ్ళీ జానపద సినిమాల్లో చూపినట్లు తిరిగి అధికారం హస్తగతం చెసుకున్నాడు. రామారావును తిరిగి ముఖ్యమంత్రి గా పునః ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వా నికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే, ఆయన ప్రభ తిరిగి శిఖ రాగ్రానికి చేరిన సందర్భమిది.

Image result for senior NTR

ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 1984 లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలు పరిచాడు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికి రాదని శాసనమండలిని రద్దు చేసాడు (1985 జూన్  1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌ సాగర్ కట్ట పై (ట్యాంకుబండ్) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985 లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు.

Image result for senior NTR

1985-89 మధ్య కాలంలో తనలో పెరిగిపోయిన మితిమీరిన నిరంకుశ భావనలు ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడి పించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989 లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్తమంత్రుల్ని తీసుకున్నాడు.

ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసు కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు.

Image result for senior NTR

1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.

1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడి గా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. శాసన సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను  9  సార్లు సభనుండి బహిష్కరించారు. 

పతనోన్ముఖం

ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని  1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఆయన వ్యక్తి గత జీవితం, కుటుంబ సభ్యులతో ఆయన సంబంధాలపై ఈ  పెళ్ళి కారణంగా నీడలు కమ్ము కున్నట్లు కనిపించాయి.

1994 లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్న డూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు.

Image result for senior NTR

అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగ జేసు కోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్ఠగా ఆయన అల్లుడు, ఆనాటి మంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు కుయుక్తులు ప్రయోగించి  ప్రజా వ్యతిరేఖత ఆధారంగా  తిరుగు బాటు చేసాడు.  అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి  18 న 73 యేళ్ళ  వయసులో గుండెపోటు తో ఎన్టీఆర్ మరణించాడు.

ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.  


ఆయన  జయంతి నేడు. ఆ మహనీయుణ్ణి స్మరించుకుందాం. 

Image result for jayalalitha ntr kathanayakuDu

మరింత సమాచారం తెలుసుకోండి: